RATHA SAPTHAMI IN TTD LOCAL TEMPLES _ స్థానికాల‌యాల్లో ఏకాంతంగా రథసప్తమి

Tirupati, 08 February 2022: TTD organised the holiest Ratha Sapthami fete on the occasion of Surya Jayanti in the Magha Suddha Sapthami day at TTD local temples in Tirupati on Tuesday in Ekantam as per covid guidelines. 

AT TIRUCHANOOR TEMPLE

 As part of celebrations, TTD is organising a host of vahana sevas at the Sri Padmavati temple, Tiruchanoor in Ekantam from morning tonight. The sevas included Surya Prabha, Hamsa, Aswa Garuda and Chinna Sesha followed by Snapana Tirumanjanam at Sri Krishna mukha mandapam,and later Chandra Prabha and Gaja vahana were performed.

TTD organised Aswa vahana, Asthana at the Sri Surya Narayana temple adjacent to Sri Padmavati temple was also observed. 

TTD JEO Sri Veerabrahmam, DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy archaka Sri Babu Swami, Superintendents Sri Seshagiri, Sri Madhu, Temple Inspector  Sri Rajesh were present.

AT SRI GOVINDARAJA SWAMY TEMPLE

 The deities were taken a ride on seven vahanas.

DyEO Sri Rajendrudu, AEO Sri Ravikumar Reddy, chief Archaka Sri Srinivasa Dikshitulu and other staffs were also present.

AT SRI KONDANDARAMA SWAMY TEMPLE

At Sri Kodandarama Swamy temple Asthanam was held to utsava idols of Sri Sita Lakshmana Sameta Sri Ramachandra Murty.

At Srinivasa Mangapuram and Appalayagunta temples also the utsava idols of Swami and Ammavaru Tiruchi and Asthanam were performed as part of Ratha Sapthami celebrations.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

స్థానికాల‌యాల్లో ఏకాంతంగా రథసప్తమి

తిరుపతి  08, ఫిబ్రవరి 2022: సూర్యజయంతిని పురస్కరించుకుని టీటీడీ స్థానికాల‌యాల్లో మంగ‌ళ‌వారం రథసప్తమి పర్వదినాన్ని నిర్వ‌హించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ప‌ర్వ‌దినాన్ని ఏకాంతంగా చేప‌ట్టారు.

తిరుచానూరులో..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల‌ వాహ‌న‌మండ‌పంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించారు. ఉదయం 7 గంటల నుంచి వాహ‌న‌సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు సూర్యప్రభ వాహనం, హంస‌ వాహనం, అశ్వ‌ వాహనం, గరుడ వాహనం, చిన్న‌శేష వాహనసేవ‌లు జ‌రిగాయి. ఆ త‌రువాత శ్రీకృష్ణ ముఖ మండపంలో స్న‌ప‌న‌తిరుమంజ‌నం చేప‌ట్టారు. సాయంత్రం చంద్రప్రభ వాహనం, రాత్రి గ‌జ వాహనసేవ నిర్వహిస్తారు.

అదేవిధంగా, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారిని అశ్వవాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు శ్రీ శేష‌గిరి, శ్రీ మ‌ధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

గోవిందరాజ స్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. ఆ త‌రువాత హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల, గరుడవాహన సేవ‌లు జ‌రిగాయి.

ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ శ్రీ‌నివాస‌దీక్షితులు, సూప‌రింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ నారాయ‌ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ కామ‌రాజు, శ్రీ ధ‌నుంజ‌య్ అర్చ‌క బృందం పాల్గొన్నారు.

శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో..

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వ‌ర‌కు తిరుచ్చిపై శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముని ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.

శ్రీనివాసమంగాపురంలో…

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను తిరుచ్చిపై వేంచేపు చేసి ఆస్థానం చేప‌ట్టారు.

అప్పలాయగుంటలో…
అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌మూర్తుల‌ను తిరుచ్చిపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.