DHARMA RATHA YATRA TO ENHANCE DEVOTIONAL FERVOUR AMONG YOUTH-TIRUPATI JEO _ జూన్‌ 9 నుండి జూలై 9వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర

Tirupati 08 June 2018 ; Sri Venkateswara Dharmaratha Yatra mulled by TTD is aimed at enhancing spiritual fervour among the youth of today, said Tirupati JEO Sri P Bhaskar.

Commencing the Dharma Ratha Yatra in Srikurmam of Srikakulam district on Saturday, the JEO expressed his confidence that this ratha yatra is taken up by TTD as a part of Hindu Sanatana Dharma Prachara.

The JEO said this Ratha Yatra will last till July 9 covering various places in the district. Srinivasa Kalyanams will also be conducted at many places during this month long Ratha Yatra, he added.

Meanwhile the places covered by Ratham from June 9 to schedule includes Ponduru on June 10, Mandava Kuriti, June 11 in Rajam, June 12 in Regadi, Palakonda, June 13 and 14 in Veeraghattam and Seetampeta and on June 15 in Gurandi, Kotturu.

Earlier Srikakulam MLA Smt G Lakshmi Devi along with JEO performed puja to the replica deities in the Ratham and commenced Ratha Yatra. HDPP Secretary Sri Ramana Prasad was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జూన్‌ 9 నుండి జూలై 9వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర

తిరుపతి, 08 జూన్‌ 2018: శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంతో పాటు సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జూన్‌ 9 నుండి జూలై 9వ తేదీ వరకు శ్రీకాకుళంజిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా శ్రీకాకుళంజిల్లాలోని అన్ని మండలాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ధర్మరథయాత్ర జరగనుంది. రథం ఎదుట భజనలు, కోలాటాలు, గోవిందనామస్మరణతో రథ యాత్ర వైభవంగా పర్యటించనుంది. ఈ రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తుల విగ్రహాలకు భక్తులు పూజలు నిర్వహించవచ్చు. ఈ సందర్భంగా భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ, స్వామివారి ప్రసాదం, కంకణాలు అందిస్తారు.

జూన్‌ 9వ తేదీన ఉదయం శ్రీకాకుళంజిల్లా శ్రీకూర్మంలో ధర్మరథం బయలుదేరుతుంది. జూన్‌ 10వ తేదీన పొందూరు, మండవ కురిటి, జూన్‌ 11న రాజాం, జూన్‌ 12న రేగడి, పాలకొండ, జూన్‌ 13, 14వ తేదీలలో వీరఘట్టం, సీతంపేట, జూన్‌ 15న గురండి, కొత్తూరు మండలాల్లో ధర్మరథం పర్యటించనుంది. కావున భక్తులు స్వామివారు, అమ్మవార్ల దర్శనం చేసుకొవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.