RATHASAPTHAMI IN TIRUMALA ON JANUARY 24 _ జనవరి 24న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి

Tirumala, 31 December 2017 : As the year 2017 concluded with the auspicious Vaikuntha Ekadasi, TTD is now gearing up for yet another important fete Rathasapthami, which occurs on January 24.

Also known as Surya Jayanthi, on this day the processional deity of Lord Malayappa Swamy will take ride on seven vahanams on a single day and hence is also known as Mini Brahmotsavams.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTDs,TIRUPATI

జనవరి 24న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి

తిరుమల,31 డిసెంబరు 2017 ; జనవరి 24వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

ఈ సందర్భంగా సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలతో పాటుచక్రస్నానం అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.