RATHOTSAVAM HELD _ వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
TIRUPATI, 27 NOVEMBER 2022: The grand procession of the mammoth wooden chariot was held at Sri Padmavathi Ammavaru temple, on the penultimate day of the annual Brahmotsavams on Sunday morning.
Goddess Sri Padmavathi Devi seated inside the wooden chariot in Her complete elegance and royalty was taken for a colourful ride along the Mada streets amidst the accompaniment of Vedic hymns, Mangala vaidyams, performances by various artists.
The chariot was pulled all along enthusiastically by devotees. Every inch of Mada street is occupied by devotees.
Chandragiri MLA and TTD Board member Dr Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, DyEO Sri Lokanatham and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుపతి, 2022 నవంబరు 27: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
ఉదయం 7.10 గంటలకు రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోరికలు సిద్ధిస్తాయని విశ్వాసం.
రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది.
రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి రథమండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.
రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
రథోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జేఈవో శ్రీ వీర బ్రహ్మం దంపతులు, ఎస్ వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ ,ఈ ఈ లు శ్రీ మనోహర్, శ్రీ నరసింహ మూర్తి , విఎస్వోలు శ్రీ బాల్ రెడ్డి, శ్రీ మనోహర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.