REFRESHER CLASSES FOR PRIESTS OF TTD TEMPLES BEGINS _ టీటీడీ ఆల‌యాల అర్చ‌కుల‌కు పున‌శ్చ‌ర‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం

Tirupati, 06 February 2024: Three-day refresher classes for priests working in TTD temples under the auspices of Sri Venkateswara Employees Training Academy (SVETA) started at SV Vedic University, Tirupati on Tuesday.

On this occasion, Acharya Rani Sadashivamurthy, the Vice-Chancellor of SV Vedic University said that the Agamas were actually taught by the Almighty Himself and requested that priests should be traditionally ordained in temples as mentioned in Agamas.  He said that such refresher classes would greatly contribute to the strengthening of the priesthood system.

Sri Subrahmanya Reddy, Director of the SVETA, said that through such refresher classes, priests can acquire mastery.  He asked them to make use of the training classes so that the devotees would be satisfied by knowing the mysterious things embedded in Vaikhanasa Agama. 

He said that refresher classes will also be conducted for Pancharatra and Saivagama priests.

Sri Venugopala Deekshitulu, one of the Chief priests of Tirumala Srivari Temple, told how to perform Pooja Kainkaryams with devotion.  Priests should follow the traditions and stand as exemplary to the society.  He informed that through such refresher classes, the skill of the priests will increase further.

TTD Vaikhanasa Agama Advisor Sri P. Sitaramacharyulu and TTD temples’ Vaikhanasa priests participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ఆల‌యాల అర్చ‌కుల‌కు పున‌శ్చ‌ర‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 06: టీటీడీ ఆలయాల్లో ప‌నిచేస్తున్న‌ అర్చకులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉద్యోగుల శిక్ష‌ణ సంస్థ‌(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవని, అలాంటి ఆగమాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో సంప్రదాయబ‌ద్ధంగా అర్చకత్వం చేయాలని కోరారు. ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతులు అర్చక వ్యవస్థ పటిష్టానికి ఎంతో దోహ‌దం చేస్తాయన్నారు.

శ్వేత సంచాలకులు శ్రీ భూమ‌న్‌ మాట్లాడుతూ ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతుల ద్వారా అర్చకులు పాండిత్యాన్ని సంపాదించవచ్చ‌న్నారు. వైఖానస ఆగమంలోని నిగూఢ‌మైన విషయాలను తెలుసుకుని భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం చేయాల‌ని కోరారు. ఈ తరగతుల్లో ఆరోగ్య సూత్రాలపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. పాంచ‌రాత్ర‌, శైవాగ‌మ అర్చ‌కుల‌కు కూడా పున‌శ్చ‌ర‌ణ త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ పూజా కైంకర్యాలు నిష్టతో ఎలా చేయాలనే విషయాలను తెలియజేశారు. కట్టు, బొట్టు సంప్రదాయాలను పాటించి అర్చకులు సమాజంలో ఆదర్శవంతంగా నిలవాల‌న్నారు. ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతుల ద్వారా అర్చకుల నైపుణ్యం మరింత పెరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ పి.సీతారామాచార్యులు, టీటీడీ ఆలయాల వైఖానస అర్చకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.