Release of SV ORIENTAL COLLEGE LOGO by TTD Chairman _ శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాల లోగో ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
Tirupati, 17 Feb 2010: Sri D.K.Audikesavulu, Chairman TTD Board has released 125th Celebrations Logo of TTDs S.V.Oriental Degree and P.G. College in TTD Adm Bldg, Tirupati on Wednesday.
Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs, Dr. Nagaraj, DEO TTD, Smt. Lalitha Kumari, Prinicipal, S.V.Oriental College and others were present.
శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాల లోగో ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
తిరుపతి, 2010 ఫిబ్రవరి 17: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాల 125 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయనున్న ఉత్సవాల లోగోను తితిదే పాలకమండలి చైర్మెన్ శ్రీ డి.కె.ఆదికేశవులు బుధవారం ఉదయం స్థానిక తితిదే పరిపాలనా భవనంలో ఆవిష్కరించారు.
మన రాష్ట్రంలోనేగాకుండా దేశంలోనే అత్యంత పురాతనమైన ప్రాచ్యకళాశాలగా ఖ్యాతికెక్కిన ఈ కళాశాల 1824 క్రితం కూడా శ్రీ విద్వాన్ బంగారాచారి, శ్రీరంగాచారిస్వామివారు అప్పటి మద్రాస్ గ్రాండ్ ఈ కళాశాల ఏర్పాటుకు విశేష కృషి చేశారని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరుపు చుక్క-తేజస్సు, పింక్ రంగు – తామర పువ్వు జ్ఞానానికి ప్రతీక. ఇవి రెండూ గాయత్రీదేవికి ప్రతీకలు, గాయత్రీమాత వేదానికి మూలం అని అన్నారు.
125 సంవత్సరాల ఈ కళాశాల వేదాధ్యయనంతో ప్రారంభమయ్యింది. తాళపత్రాలు – వేదాలకు, సనాతన సంస్కృతికి సంకేతం. పూర్ణకుంభం – తెలుగు భాషకు, ఆంధ్ర రాష్ట్రానికి గుర్తు. ఆనంద నిలయం – శ్రీవారి పాదాల చెంత పురుడు పోసుకుని విస్తరిల్లిన ఈ కళాశాల లోగోలో ఆనంద నిలయం శ్రీవారి ప్రసాదం.
125 సంవత్సరాల ఈ కళాశాల కాలానుగుణంగా ఎదిగిన మహావృక్షమైతే, గత సంవత్సరాలలో ఎందరో మేధావులు, పండితులు ఈ కళాశాల నుండే లోకోత్తరంగా ఎదిగారు. అందుకే శాఖోపశాఖలుగా ఈ ఆకులను లోగో లో చిత్రించడం జరిగింది. హిందీ జాతీయభాష. దీన్ని మా కళాశాల బోధిస్తుంది కాబట్టి ఇందుకు చిహ్నంగా భారత జాతీయ త్రివర్ణ పతాక వర్ణమును చూపడం జరిగింది. ఈ కిరణాలు జ్ఞానకిరణాలు. ఈ ప్రతిష్ఠాత్మక లోగోను సప్తగిరి చిత్రకారుడు శ్రీ పి.శివప్రసాద్ రూపొందించారు.
ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్. కృష్ణారావు, జె.ఇ.ఓ. డాక్టర్ ఎన్.యువరాజ్ ముఖ్య భద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.