RELIEF ACTIVITIES ON WAR FOOTING AT SRI GT _ శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు 

TTD CHAIRMAN AND EO REACH THE SPOT

Tirupati, 1 June 2923: TTD chairman Sri Yv Subba Reddy  and TTD EO Sri AV Dharma Reddy rushed to spot at Sri Govindarajaswami temple where stormy winds felled a 300-year-old banyan tree and launched relief activities

JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore directed officials to speed up rehabilitation work. 

Speaking on the occasion TTD Chairman said Kadapa resident Dr Gurappa had died in the incident and TTD would pay ex gratia of ₹5 lakhs to the family

He said TTD would provide all medical aid to few Persons injured in the incident. 

The chairman and EO expressed deep sympathies to the bereaved family members.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

– హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ చైర్మన్, ఈవో

తిరుపతి 1 జూన్ 2023: తిరుపతి నగరంలో గురువారం సాయంత్రం వీచిన తీవ్రమైన గాలి , వర్షం కారణంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రావిచెట్టు పడిపోయింది.

విషయం తెలిసిన వెంటనే టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ ఏ సిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సందర్బంగా చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

సుమారు 300 సంవత్సరాల నాటి రావిచెట్టు కూలిన సంఘటనలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటన చాలా బాధాకరమన్నారు.

మృతుని కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలేమన్నారు.

ఆయన కుటుంబానికి రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని చైర్మన్ ప్రకటించారు.
ఈ సంఘటనలో ఒకరికి కాలు,మరొకరికి తలకు మరో ఇరువురి గాయాలు అయ్యాయని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

మృతుడి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిజేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచేజారీ చేయడమైనది