RENDER DEDICATED SERVICES TO DEVOTEES-SRIVARI SEVAKULU TOLD_ శ్రీవారి సేవకులు ఓర్పుతో భక్తులకు సేవలందించాలి : కన్యాకుమారి ఎస్‌పి డా|| శ్రీనాథ్‌

Kanyakumar, 26 Jan. 19: Srivari Sevakulu should render services to pilgrims with patience and affection, said Kanyakumari SP Sri Srinath.

Addressing the volunteers at Sri Venkateswara temple premises in Kanyakumari the SP said, the sevakulu have to serve food and water to the devotees who take part in Maha Kumbhabhishekam ceremony of the temple on January 27.

While the VGO of TTD informed the volunteers about the security arrangements that are in place for the grand opening ceremony.

Special Officer Sri Munirathnam Reddy also addressed the volunteers in the meeting which was presided over by the PRO Dr T Ravi.

Meanwhile TTD is all set for the ceremonial Maha Kumbhabhishekam in the auspicious Kumbha Lagnam at 7.30am on Sunday.

The activity for the day on Sunday commences with Suprabhatam followed by Kumbharadhana, Nivedana, Homam, Maha Purnahuti between 4am and 7am while the Kumbhams(holy pots) and Utsava Murthies (processional deities) will be taken out on a celestial procession and will be seated in their respective places in the Sannidhi. The Maha Kumbhabhishekam ceremony will take place between 7.30am and 9am.

After this religious ceremony, Brahmaghosha, Veda Sattumora, Dhwajarohanam, Archaka Bahumanam are observed between 9am and 10.30am while the Nitya Kainkaryams takes place between 10.30am and 12.30pm followed by Sarva Darshanam to pilgrims till 6.30pm.

In the evening, the divine wedding ceremony, Srinivasa Kalyanam takes place between 4pm and 5.30pm. Procession of deities and Dhwajavarohanam will be observed between 5.30pm and 6.30pm followed by Nitya Kainkaryams in the next one hour and then the devotees are again allowed for Sarva Darshan between 7.30pm and 8.30pm while the closure of the temple for the day is marked by the conduct of Ekanta Seva at 8.45pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి సేవకులు ఓర్పుతో భక్తులకు సేవలందించాలి : కన్యాకుమారి ఎస్‌పి డా|| శ్రీనాథ్‌

శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

జనవరి 26, కన్యాకుమారి 2019: కన్యాకుమారిలో జనవరి 27వ తేదీ ఆదివారం జరుగనున్న శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం, శ్రీనివాస కల్యాణాలకు విచ్చేసే భక్తులకు శ్రీవారిసేవకులు ఓర్పుతో సేవలందించాలని కన్యాకుమారి జిల్లా ఎస్‌పి డా|| శ్రీనాథ్‌ కోరారు. కన్యాకుమారిలోని వివేకానందపురంలో టిటిడి నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద శనివారం శ్రీవారిసేవ టీమ్‌ లీడర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌పి డా|| శ్రీనాథ్‌ మాట్లాడుతూ మహాకుంభాభిషేకం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశముందని, అందరికీ అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని సూచించారు. భక్తులకు సరైన సమాచారం అందించి సహకరించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా సేవలందించాలని కోరారు.

ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ మహాకుంభాభిషేకం కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు. టిటిడి తిరుపతి విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ భద్రతపరంగా శ్రీవారి సేవకులకు తగిన సూచనలు చేశారు. టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో శ్రీవారిసేవకులు సమన్వయం చేసుకోవాలన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ విఎస్‌వో శ్రీ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మహాకుంభాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి :

కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకానికి సంబంధించి టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరుగనుంది.

ఇందులో భాగంగా ఉదయం 4 నుండి 7 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7 నుండి 7.30 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆయా సన్నిధుల్లోకి వేంచేపు చేస్తారు. ఉదయం 7.30 నుండి 9 గంటల నడుమ కుంభ లగ్నంలో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు.

ఆ తరువాత ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు బ్రహ్మఘోష, వేదశాత్తుమొర, ధ్వజారోహణం, అర్చక బహుమానం, ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్యకైంకర్యాల అనంతరం సాయంత్రం 6.30 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.

శ్రీనివాస కల్యాణం :

శ్రీవారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఇందుకోసం వేదికను సిద్ధం చేశారు. ఆ తరువాత సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.