TTD EO PRESENTS VASTRAMS TO BHAGAVATHI AMMAN_ కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మవారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Kanyakumari, 26 Jan. 19: TTD EO Sri Anil Kumar Singh al on Saturday evening presented silk vastrams to Bhagavathi Amman in Kanya kumari temple of Tamilnadu.
As Maha Kumbhabhishekam of Sri Venkateswara Swamy temple at Kanya kumari is scheduled for Sunday, on the eve of the ceremony, EO offered vastrams to Devi Kanya kumari, the presiding deity of Kanyakumari temple who is also popularly known as Bhagavathi Amman.
Earlier during the day, the Joint Commissioner of Endowment department Sri. offered silk vastrams to Sri Venkateswara Swamy temple in view of Maha Kumbhabhishekam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మవారికి టిటిడి ఈవో పట్టువస్త్రాల సమర్పణ
కన్యాకుమారి, జనవరి 26, 2018: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్యాకుమారిలో గల శ్రీ భగవతి అమ్మవారికి టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శనివారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
కన్యాకుమారిలో టిటిడి నిర్మించిన శ్రీవారి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం ఉన్న కారణంగా ఈవో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భగవతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కన్యాకుమారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
కాగా, టిటిడి శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం మహా కుంభాభిషేకం సందర్భంగా తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ శ్రీ అన్బుమణి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.