RENDER DEVOTED SERVICES ON V DAY _ భక్తులకు మరింత మెరుగైన సేవలు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 11 Jan. 22: The Additional EO of TTD Sri AV Dharma Reddy called on employees who are deployed for Vaikunta Ekadasi to render devoted services to visiting pilgrims.

A meeting with all the deputation staff was held at Asthana Mandapam in Tirumala on Tuesday evening.

Later a similar meeting on reception with deputed staff was held at Vakulamata Rest House.

SE 2 Sri Jagadeeshwar Reddy, GM IT Sri Sesha Reddy, Health Officer Dr Sridevi, other Deputy EOs and other officials, deputation staff were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు మరింత మెరుగైన సేవలు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 11: తిరుమల దివ్య క్షేత్రంలో జ‌న‌వ‌రి 13వ తేదీన వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కలుగకుండా మరింత మెరుగైన సేవలందించాలని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టిటిడి డెప్యూటెషన్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నానికి విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

అదేవిధంగా వ‌కుళామాత విశ్రాంతి భ‌వ‌నంలో వ‌స‌తి విభాగం అధికారుల‌కు, సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.