UP GHAT OPENS UP FOR PILGRIMS AFTER 40 DAYS _ 40 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి అప్ ఘాట్ రోడ్డు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 11 Jan. 22: TTD Additional EO Sri AV Dharma Reddy on Tuesday afternoon opened up the Second Ghat Road (up ghat) at around 2:30pm for vehicular movement.

Later speaking to media he said the Up Ghat road was closed on December 1 onwards following heavy boulder which has damaged the roads critically. But with the day and night efforts put up by our CE and his team along with AFCON officials we have completed the restoration of up ghat on time and opened it today almost after forty days for conveyance of devotees. We appreciate their sincere efforts on behalf of our Chairman and EO”, he maintained.

CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, EE Sri Surendranath Reddy, VGO Sri Bali Reddy, DSP Sri Prabhakar, Traffic DSP Sri Venugopal, DyEE Sri Ramana, AFCON In-Charge Sri Swamy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

40 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి అప్ ఘాట్ రోడ్డు – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 11: తిరుమ‌ల‌ రెండ‌వ (అప్ ఘాట్‌) రోడ్డు పునరుద్ధరణ పనులను పూర్తి చేసి టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ట్రాఫిక్‌ను ప్రారంభించారు.

అనంతరం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) రోడ్డులో భారీ బండరాళ్లు ప‌డ‌టం వ‌ల‌న మూడు ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బ‌తిన్నట్లు చెప్పారు. అయితే జ‌న‌వ‌రి 10వ తేదీకి అప్ ఘాట్ రోడ్డును భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావ‌ల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. అయితే సిఇ ఆధ్వ‌ర్యంలో టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, ఆఫ్కాన్ సంస్థ ప్ర‌తినిధులు క‌లిసి పగలు, రాత్రి విరామం లేకుండా ఘాట్‌ రోడ్డు మరమ్మతు పనులను శరవేగంగా పూర్తి చేసి నిర్ణీత స‌మ‌యంలోనే భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. అయితే అక్క‌డ‌క్క‌డ చిన్న‌పాటి మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేయ‌వ‌ల‌సి ఉండ‌గా భారీ వాహనాలు లింక్ రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించబడతాయ‌ని చెప్పారు.

దాదాపు 40 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ర‌వాణా సౌక‌ర్యాం ప్రారంభించామ‌న్నారు. టిటిడి ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేసిన కృషికి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌ర‌పున అద‌న‌పు ఈవో హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

అద‌న‌పు ఈవో వెంట టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ – 2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, విజివో శ్రీ బాలి రెడ్డి, డీఎస్పీ శ్రీ ప్రభాకర్, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ వేణుగోపాల్, డెప్యూటీ ఇఇ శ్రీ రమణ, ఆఫ్కాన్ ఇన్‌ఛార్జ్ శ్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.