RENDER SERVICES TO PILGRIMS WITH THE INSPIRATION OF OUR NATIONAL LEADERS-JEO_ జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి: గణతంత్ర వేడుకల్లో జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 26 January 2018: Recalling the sacrifices and will power of national great leaders who strived to establish a Republican India, Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon the employees in Tirumala to offer services to pilgrims taking them as inspiration.

In his Republic Day address after hoisting National Flag on Friday in Gokulam Rest House premises the JEO said, TTD has introduced many pilgrim initiatives including allotment of accommodation in a transparent manner by electronic way and also issuing 20thousand tickets including 14thousands in Alipiri and 6 thousands in srivarimettu footpath routes for pedestrian pilgrims. Both these systems have been stabilised now. I wish all the employees will work with same spirit in future too”, he added.

The JEO said, many more pilgrim initiatives will come up in future as tge vision and mission of TTD is to serve pilgrims in best possible way.

DyEO Temple Sri Kodanda Rama Rao, SE 2 Sri Ramachandra Reddy, Health Officer Dr Sermista, VGOs Smt Sada Lakshmi, Sri Ravindra Reddy and othera were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి: గణతంత్ర వేడుకల్లో జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 26 జనవరి 2018: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టిటిడి ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో శుక్రవారం నాడు జరిగిన 69వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జెఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.

ఆ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం టిటిడి పలు చర్యలు చేపడుతోందన్నారు. భక్తులకు పారదర్శకంగా గదులు కేటాయించేందుకు ఎలక్ట్రానిక్‌ టోకెన్‌ విధానాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. కాలినడక భక్తుల కోసం ఒక రోజుకు అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు జారీ చేస్తున్నామన్నారు. ఈ రెండు విధానాలు ప్రస్తుతం చక్కగా అమలవుతున్నట్టు చెప్పారు. ఉద్యోగులు చక్కటి సేవలు అందిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సేవలందించాలని కోరారు. భక్తులకు నాణ్యమైన సేవలందించేందుకు భవిష్యత్తులో మరిన్ని నూతన కార్యక్రమాలను టిటిడి అమలుచేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామారావు, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆరోగ్యఖాధికారి డాక్టర్‌ శర్మిష్ఠ, విజివోలు శ్రీమతి సదాలక్ష్మి, శ్రీ రవీంద్రారెడ్డి తదితర అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.