RENDER SERVICES WITH DEVOTION-TIRUPATI JEO TO SEVAKULU_ కల్యాణానికి విచ్చేసే భక్తులకు భక్తిశ్రద్ధలతో సేవలందించాలి : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Vontimitta, 30 March 2018: The Srivari Sevakulu should render services to devotees who will be attending Sri Sita Rama Kalyanam with utmost devotion said Tirupati JEO Sri P Bhaskar.

Addressing Srivari Sevakulu and Scouts at Kalyana Vedika in Vontimitta on Friday noon, the JEO while appreciating the services of Srivari Sevakulu asked them to give more quality services as tens of thousands of pilgrims are set to throng the Kalyanam on Friday evening. He said about 1300 Sevakulu and 800 scouts have been deployed to offer services to pilgrims.

Earlier, CVSO Sri A Ravikrishna, Health Officer Dr Sermista, Special Officer Annaprasadam Sri S Venugopal, DyEO General Smt Gautami also briefed the Sevakulu about security, Annaprasadam, water and talambralu distribution.

CE Sri Chandrasekhar Reddy, Additional CVSO Sri Sivakumar Reddy, PRO Dr T Ravi were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కల్యాణానికి విచ్చేసే భక్తులకు భక్తిశ్రద్ధలతో సేవలందించాలి : టిటిడి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

ఒంటిమిట్ట, 2018 మార్చి 30: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయం చెంత శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో సేవలందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ కోరారు. ఒంటిమిట్టలోని కల్యాణవేదిక వద్ద ఉదయం శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో జెఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఒంటిమిట్ట రామాలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇందులో కల్యాణోత్సవం విశిష్టమైనదని అన్నారు. రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి స్థానికులతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసే అవకాశముందని తెలిపారు. భక్తులను క్రమబద్ధీకరించడంతోపాటు కల్యాణం అనంతరం అందరూ స్వామి, అమ్మవారి దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. మొత్తం 200 కౌంటర్లలో ప్రసాదాలు, ముత్యంతో కూడిన తలంబ్రాలను భక్తులకు అందించాలని సూచించారు. భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ అందించాలన్నారు.

టిటిడి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ శ్రీవారి సేవకులు టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతాపరంగా సహకారం అందించాలని కోరారు. కేటాయించిన చోట ఉండి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అనుమానితులు తారసపడితే వెంటనే భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకురావాలన్నారు.

టిటిడి డెప్యూటీ ఈవో శ్రీమతి గౌతమి మాట్లాడుతూ శ్రీవారి సేవకుల సహకారంతో ముత్యంతో కూడిన తలంబ్రాలను రెండు లక్షల ప్యాకెట్లు సిద్ధం చేశామని తెలిపారు. భక్తులందరికీ తలంబ్రాల ప్యాకెట్లు అందేలా శ్రీవారి సేవకులు సహకరించాలని కోరారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శర్మిష్ట, సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.