KALYANA VEDIKA ASSUMES COLOURFUL LOOK_ భూలోక నందనవనంగా రాములవారి కల్యాణవేదిక

Vontimitta, 30 March 2018: The entire stage where the celestial wedding performed was decked in a tasteful manner with various varieties of traditional and cut flowers.

About three tonnes of traditional flowers, 20,000 numbers of cut flowers
500 kg of various fruits were used. 40 florists from Bangalore worked with expertise and decorated the Vivaha Mandapam. The pandal raised with fruits including apple, orange, grapes provided visual treat to devotees.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భూలోక నందనవనంగా రాములవారి కల్యాణవేదిక

ఒంటిమిట్ట, 2018 మార్చి 30: దాంపత్యంలో లోకానికి ఆదర్శాన్ని చాటిన శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఒంటిమిట్టలో ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కల్యాణవేదిక నందనవనాన్ని తలపిస్తోంది. రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. చల్లటి సాయంత్రం వేళ సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.

చెరుకులు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, ఆఫ్రికన్‌ ఆరంజ్‌, గ్రీన్‌ ఆపిల్‌, రెడ్‌ ఆపిల్‌, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్కజొన్న తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. సంప్రదాయం ఉట్టిపడేలా 3 టన్నుల సంప్రదాయపుష్పాలు, 25 వేల కట్‌ ఫ్లవర్స్‌, 500 కిలోల ఫలాలు వినియోగించారు. ఇందులో టిటిడి ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది కలిపి 40 మంది ఇందుకోసం పనిచేశారు.

ఆకట్టుకున్న విద్యుద్దీపాలంకరణ :

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన విద్యుద్దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్యాణవేదిక ప్రాంగణంలో 24 ఎల్‌ఇడి స్క్రీన్లు, లేజర్‌ లైట్లు ఏర్పాటుచేశారు. ఆలయం, కల్యాణవేదిక ప్రాంతాల్లో శ్రీరామపట్టాభిషేకం, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు, రామాయణంలోని ఘట్టాలు తదితర విద్యుత్‌ దీపాల కటౌట్లను అద్భుతంగా తీర్చిదిద్దారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.