REPAKULA SUBBAMMA TOTOTSAVAM_ ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం
Tirupati, 28 March 2018: Lord Sri Rama visited the site of His ardent devotee REPAKULA Subbamma as a part of the special utsavams of Kodanda Ramalayam on Wednesday.
Repakula Subbamma, an ardent devotee of Lord Sri Rama used to offer largesse during brahmotsavams some 100 years ago. She pioneered Kalpavriksha and Sarvabhupala Vahanam in 1910. In 1933 after her demise she continued her reverence to Lord by donating a piece of land where RS Gardens and SV Balamandir schools are now located in the heart of the temple city.
As a tribute to her dedicated bhakti, Lord Rama along with Sita Devi and Lakshmana Swamy visits her gardens every year after annual brahmotsavams. This fete is popularly known as Repakula Subbamma Tototsavam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఘనంగా రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం
తిరుపతి, 2018 మార్చి 28: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణస్వామి వారికి బుధవారం రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు కోదండరామాలయం నుండి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట(ఆర్‌ఎస్ గార్డెన్స్)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 8.30 నుండి 10.00 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు. సాయంత్రం 5.00 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం, ఆస్థానం, నిర్వహించిన అనంతరం ఊరేగింపు ప్రారంభంకానుంది. రాత్రి 9.00 గంటలకు ఈ ఊరేగింపు శ్రీ కోదండరామాలయానికి చేరుకోనుంది.
శ్రీకోదండరామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించేవారు. 1910వ సంవత్సరం నుండి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు. తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరంలో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్ గార్డెన్స్ ఉన్నాయి. కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝూన్సీ, సూపరెంటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మార్చి 29 నుండి తెప్పోత్సవాలు :
శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు మార్చి 29 నుండి 31వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7.00 నుడి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.