మార్చి 30న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో హనుమంతవాహనసేవ

మార్చి 30న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో హనుమంతవాహనసేవ

తిరుపతి, 2018 మార్చి 28: చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 30వ తేదీ శుక్రవారం విశేషమైన హనుమంత వాహనసేవ వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఏప్రిల్‌ 1న కల్యాణోత్సవం

ఏప్రిల్‌ 1వ తేది ఆదివారం సాయంత్రం 5.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణం వేడుకగా జరుగనుంది. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.