REPLICA TEMPLE OF LORD VENKATESWARA OPENS UP AT VIJAYAWADA _ నమూనా ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభం

SVV TO COMMENCE WITH “SWARNA PUSHPARCHANA” ON JULY 4

Vijayawada, 3 July 2017: The replica temple of temple of Lord Venkateswara opened on a religious note in PWD grounds of Vijayawada on Mondayevening in connection with the week long fete of Sri Venkateswara Vaibhavotsavams.

On the first day evening, the religious ceremonies including Punyahavachanam, Vastu Shanti Homam, Visvaksena Puja, Tiruveedhi Utsavam were performed by the priests between 4:30pm to 6pm before the temple is opened up for the devotees.

HH Sri Siddheswarananda Bharati Swamy of Kutralam Mounswami Mutt of Tamilnadu rendered spiritual address on the importance of the fete followed by the melodious rendition of keertans by renowned devotional playback singer Sri Gangadhara Shastri.

TEMPLE RITUALS ON JULY 4

Meanwhile there will be Suprabhatam by 6:30am, Thomala and Koluvu between 7am and 8am followed by archana.

The weekly rituals commences with Asta Dala Pada Padmaradhana Seva otherwise called “Swarna Pushparchana” where in the archakas render 108 sacred names of Lord by offering each golden lotus at the holy feet of the deity for each name. This ritual will be observed between 9am and 10am.

While in the evening there will be unjal seva between 5:45pm to 6:30pm followed by Tiruveedhi utsavam between 6:30pm to 7:15pm. During Unjal Seva, Smt Kousalya and Sri Sri Krishna team will render devotional keertans which will be followed by religious discourse by renowned scholar Sri Mylavarapu Srinivasa Rao.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నమూనా ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభం

విజయవాడ, 2017 జూలై 03: విజయవాడలోని పి.డబ్యు.డి. గ్రౌండ్స్‌లో టిటిడి ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సోమవారం సాయంత్రం నుండి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించే విధంగా విజయవాడలోని పి.డబ్యు.డి. గ్రౌండ్స్‌లో జూలై 4వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు పుణ్యాహవచనం – వాస్తుశాంతి హోమం, విష్వక్సేన పూజ, విష్వక్సేనులవారి తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.00 గంటల నుండి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

ఇందులో భాగంగా సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల విశిష్టతపై తమిళనాడులోని కుట్రాలానికి చెందిన శ్రీ మౌనస్వామి మఠం స్వామీజీ శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు అనుగ్రహభాషణం చేశారు. సాయంత్రం 7.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ గంగాధర్‌ శాస్త్రి బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

జూలై 4వ తేదీ మంగళవారం నమూన ఆలయంలో కార్యక్రమాలు

శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం ఉదయం 6.30 గంటలకు సుప్రభాతం, 7.00 నుండి 8.00 గంటల వరకు తోమలసేవ, కొలువు, ఉదయం 8.00 గటలకు అర్చన నిర్వహిస్తారు.

అష్టదళ పాదపద్మారాధన – ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు….

అష్టదళాలతో కూడిన స్వర్ణ పుష్పాలను 108ని ఒక్కొక్క నామమును ఉచ్చరించుచూ స్వామి పాదపద్మాలపై ఉంచుటను ‘అష్టదళ పాద పద్మారాధన’ అంటారు.

దీనిని స్వర్ణ పుష్పార్చన అని కూడా అంటారు. ఇది ప్రతిమంగళవారంమధ్యాహ్న కాలార్చనగా జరుగుతున్నది. శ్రీవారి ఆలయంలో దీనిని ప్రారంభించిసుమారుగా 35 సంవత్సరాలు కావస్తుంది. స్వర్ణపుష్పసమర్పణ ఉత్తమోత్తమ ఉపచారంగా ఆగమ గ్రంథాలలో చెప్ప బడింది. స్వర్ణపుష్పాలు ఎప్పటికీ నిర్మాల్యములు కావు. ఇది ఆర్జిత సేవగా స్వామికి జరుపబడుతున్నది.

సాయంత్రం 5.45 నుండి 6.30 గంటల వరకు ఊంజలసేవ, సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 వరకు స్వామివారు ఉభయ నాంచరులకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాయంత్రం 4.00 నుంచి 6.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ పి.ఆర్‌. కౌసల్య, శ్రీకృష్ణ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.15 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ మైలవరపు శ్రీనివాసరావు ధార్మిక ఉపన్యాసం ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.