జూలై 4 నుంచి తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు

జూలై 4 నుంచి తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు

తిరుపతి, 2017 జూలై 03: టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారు, శ్రీసిద్ధేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు జూలై 4 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి.

ఘనంగా అంకురార్పణ :

బ్రహ్మూెత్సవాలకు సోమవారం సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విష్వక్సేనారాధన, సేనాధిపతి ఉత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మూెత్సవాలు :

జూలై 4న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహన సేవ జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం పల్లకీ సేవ ఉంటుంది. జూలై 5న హంస వాహనం, జూలై 6న సింహవాహనం, జూలై 7న హనుమంత వాహనం, జూలై 8న శిఖర దీపారాధనం, గరుడ వాహనం, జూలై 9న ఆర్జిత కల్యాణోత్సవం, గజవాహనం, జూలై 10న రథోత్సవం, జూలై 11న అశ్వవాహనం, జూలై 12న ఉదయం వసంతోత్సవం, రాత్రి ధ్వజావరోహణం జరుగనున్నాయి.

శ్రీ సిద్ధేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాలు :

జూలై 4న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం పల్లకీ సేవ ఉంటుంది. జూలై 5న చంద్రప్రభ వాహనం, జూలై 6న చిన్నశేషవాహనం, జూలై 7న సింహ వాహనం, జూలై 8న శిఖర దీపారాధనం, నందివాహనం, జూలై 9న ఆర్జిత కల్యాణోత్సవం, గజవాహనం, జూలై 10న పల్లకీసేవ, జూలై 11న పార్వేటి ఉత్సవం, జూలై 12న ఉదయం వసంతోత్సవం, రాత్రి ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.

జూలై 9వ తేదీ శ్రీ చెన్నకేశవస్వామివారు, శ్రీ సిద్ధేశ్వరస్వామివార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. గ హస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్నవచ్చు. గహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవిక, ఒక లడ్డూ, ఒక వడ, అన్న ప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 13వ తేదీ ఉదయం 9.00 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.00 నుండి 8.00 గంటల వరకు శ్రీచెన్నకేశవస్వామివారు, శ్రీసిద్ధేశ్వరస్వామివార్లకు పుష్పయాగం వైభవంగా జరుగనుంది.

బ్రహ్మూెత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.