RENDER DEVOUT SERVICES WITH COMMITMENT-JEO TIRUMALA_ జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి : గణతంత్ర వేడుకల్లో జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 26 Jan. 19: Tirumala JEO Sri KS Sreenivasa Raju during his Republic Day address called upon the TTD work force in Tirumala to dedicate themselves in the services of pilgrims.

After hoisting the National Flag on Saturday in Gokulam Rest House premises, the JEO in his speech recalled the great sacrifices of National leaders in bringing freedom to the Nation as well their efforts in making the country Republic.

With similar commitment we should render services to the pilgrims, he aspired.

SE II Sri Ramachandra Reddy, VGO Sri Manohar and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి : గణతంత్ర వేడుకల్లో జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 26 జనవరి 2019: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టిటిడి ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో శ‌నివారం ఉద‌యం 70వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జెఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ నాడు స్వాతంత్య్ర సమరంలో ఎందరో త్యాగశీలురు దేశం కోసం తమ ప్రాణాలను సైతం ఒడ్డి ఈ స్వాతంత్య్ర ఫలాలను అందించారన్నారు. అనంతరం ప్రజల దగ్గరే ప్రభుత్వం ఉండాలన్న ఆకాంక్షతో సార్వభౌమత్వాన్ని కూడా మనం జనవరి 26, 1950వ సంవత్సరంలో సాధించామన్నారు.

భక్తుల సౌకర్యార్థం టిటిడి పలు చర్యలు చేపడుతోందన్నారు. ఉద్యోగులు చక్కటి సేవలు అందిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ సేవలందించాలని కోరారు. భక్తులకు నాణ్యమైన సేవలందించేందుకు భవిష్యత్తులో మరిన్ని నూతన కార్యక్రమాలను టిటిడి అమలు చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శర్మిష్ఠ, ఇత‌ర అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.