REST HOUSE OPENED _ తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిల‌యాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

Tirupati, 2 Oct. 19: The massive new rest house,  Padmavathi Nilayam(PAN) constructed by TTD at Tiruchanoor at a cost of Rs.74.70 crores was opened by TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Wednesday.

The 8-floor new complex spread over 4.26 lakh sq. feet houses a spiritual library,  five dormitories(4 Non-Ac and one A/C), cellar parking for 135 cars, 200 rooms (120 non-A/C and 80 A/c to accommodate 1800 persons.

 

On the occasion of the 150th Birth Anniversary of Mahatma Gandhi, the Chairman has offered prayers to the photo of Bapuji in PAN building and recalled his sacrifices in the freedom struggle.

 

Earlier, he also laid the foundation stone to the four-lane road works taken up by TTD from Alipiri to Cherlopalli junction spanning 6.30 km  at a cost of  Rs.28 crores.

CE Sri Ramachandra Reddy,  SEs Sri Ramesh Reddy,  Sri Sriramulu and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులోని  శ్రీ పద్మావతి నిల‌యాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి  
 
తిరుపతి, 2019 అక్టోబరు 02:   తిరుచానూరులోని  శ్రీ పద్మావతి నిల‌యాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి  

భక్తుల సౌకర్యార్థం తిరుచానూరులో నూతనంగా నిర్మించిన శ్రీపద్మావతి నిలయాన్నిటిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మాడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌తో క‌లిసి బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుచానూరులో టిటిడి 4.26 లక్షల చదరపు అడుగులలో దాదాపు రూ.74.70 కోట్లతో టిటిడి నిర్మించింద‌న్నారు. ఇందులో 200 వసతి గదులలో 120 నాన్ ఏసీ గదులు, 80 ఏసీ గదులు ఉన్నాయ‌ని తెలిపారు. 4 నాన్ ఏసీ డార్మిటరీలు, 1 ఏసీ డార్మిటరీని, రిసెప్ష‌న్‌, ఈ-దర్శన్ కౌంటర్లు, ఏటీఎం, క్లాక్ రూమ్స్, రెస్టారెంట్  ఏర్పాటు చేశామ‌న్నారు. రోజుకు దాదాపు 1600 మందికి వసతి సౌకర్యం కల్పించేలా ఈ భవనాన్ని నిర్మించిన‌ట్లు వివ‌రించారు. భ‌క్తులు ఈ స‌దుపాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.
 
అనంత‌రం శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యంలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహాత్ముని చిత్రపటానికి ఛైర్మ‌న్ పుష్పాంజలి ఘటించారు. శాంతి మార్గం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం తీసుకువ‌చ్చార‌న్నారు. అంద‌రు గాంధీ మార్గాన్ని అనుస‌రించాల‌ని, ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు.

అలిపిరి – చెర్లోపల్లి రోడ్డు విస్తరణ ప‌నుల‌కు శంకుస్థాప‌న

 అంత‌కుముందు భక్తుల సౌకర్యార్థం అలిపిరి నుండి చెర్లోపల్లి వ‌ర‌కు ఉన్న రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులకు టిటిడి ఛైర్మ‌న్ శంకుస్థాప‌న చేశారు.

 ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తులు సుర‌క్షిత ప్ర‌యాణానికి అలిపిరి నుండి చెర్లోపల్లి వ‌ర‌కు ఉన్న6.30 కి.మీలలో నాలుగు లేన్ల పనులను రూ.28 కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు ఏడాది కాలంలో ఈ పనులను పూర్తి చేయనున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  టిటిడి సిఇ శ్రీ రామ‌చంద్ర‌రెడ్డి, ఎస్ఇ -1 శ్రీ ర‌మేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ రామూర్తి రెడ్డి, విజివో శ్రీ అశోక్‌కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.