RESTORATION WORKS OF SRIVARI PADALU TO COMMENCE ON SEPT 18 _ నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాలు : జెఈవో

TIRUMALA, SEPT 17:  The restoration works of Srivari Padalu, the historical holy feet situated on the highest peak of Narayanadri mountain among the seven hills of Tirumala will be commenced on Wednesday after performing puja said Tirumala JEO Sri KS Sreenivasa Raju.
 
Addressing media persons in Tirumala on Tuesday, the JEO said, TTD has identified some scratch on the holy feet few days ago which is believed to be caused unknowingly by some devotees due to breaking of coconuts as a part of the fulfilment of their offer. After discussing in length with the temple priests, Agama scholars and the stapathi (Sculptor) who designed this holy feet some decades ago, we have decided to restore them”, he added.
 
“Since the muhurat has been decided on Wednesday, the pilgrims will not be allowed to visit this place till the works are over. We have also decided to arrange a scratch poof and unbreakable glass cover to these holy feet”, he added.
 
Later one of the chief priests of the temple Dr AV Ramana Dikshitulu said, there is no mention of specific aradhana or puja about these holy feet in Agamas. But keeping in view the sentiments of the pilgrims, we have decided to restore these feet by performing special puja on Wednesday”, he said.
 
Speaking to media one of the Agama scholars of TTD Sri Sundaravadanacharyulu said, Kanya Lagnam has been fixed to take up this restoration works. “This is indeed an auspicious muhurat since September 18 also happens to be the Jayanthi of Lord Anantapadmanabha.
 
The time is fixed between 6am to 7.30pm”, he maintained.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాలు : జెఈవో

తిరుమల, సెప్టెంబరు 17, 2013: తిరుమల శేషాచల పర్వతశ్రేణుల్లో అత్యంత ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన నారాయణగిరిలో నూతన శ్రీవారి పాదాల ఏర్పాట్లు బుధవారం చేపడుతున్నట్టు తితిదే తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు.

తిరుమలలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి శ్రీవారి పాదాలను దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారని తెలిపారు. కొన్ని రోజుల కిందట శ్రీవారి పాదాలకు భిన్నత్వం ఏర్పడినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు, ఆగమ సలహాదారులు, అప్పట్లో శ్రీవారి పాదాల స్థపతి శ్రీ లక్ష్మీనారాయణను సంప్రదించి నూతన శ్రీవారి పాదాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి భక్తుల సందర్శనను నిలుపుదల చేస్తున్నట్టు చెప్పారు. బుధవారం నాడు ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం నూతన పాదముద్రలను స్థాపిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భిన్నత్వం కలగకుండా శ్రీవారిపాదాలపై రెండు వారాల్లో పగలని గాజు కవచాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన తరువాత తిరిగి ఎప్పటినుండి భక్తులను అనుమతిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామన్నారు.

శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన డాక్టర్‌ ఎ.వి.రమణదీక్షితులు మాట్లాడుతూ నారాయణగిరి శిఖరంపై వెలసియున్న శ్రీవారి పాదాలను పూర్వీకులు రూపొందించినట్టు తెలిపారు. ఈ పాదాలకు ఎటువంటి ప్రత్యేక ఆరాధనా విధానం ఆతమశాస్త్రాల్లో లేదన్నారు. ఇది ఒక చారిత్రక వైశిష్ట్యం గల ప్రదేశమని వివరించారు. అయితే భిన్నత్వాన్ని నివారించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు తిరిగి నూతన పాదాల ఏర్పాటుకు ఒక శుభముహూర్తం నిర్ణయించినట్టు తెలిపారు. తితిదే ఆగమ సలహాదారు శ్రీ సుందరవదనాచార్యులు మాట్లాడుతూ బుధవారం ఉదయం 6.00 నుండి 7.30 గంటల మధ్య కన్యాలగ్నంలో నూతన శ్రీవారి పాదాల ఏర్పాటు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఇది విశేషమైన ముహూర్తమని, బుధవారం శ్రీ అనంతపద్మనాభస్వామివారి జయంతి కూడా కావడం విశేషమన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.