RESTRICTIONS ON TWO WHEELER MOVEMENT TIMINGS _ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8గంటల వరకే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి.

Tirumala, 04 December 2023:In view of the cyclonic downpour coupled with foggy climate, TTD  has banned plying of two-wheelers on ghat roads. The two-wheelers will be allowed only between 6am and 8pm until the weather conditions are normal.

TTD JEO Sri Veerabrahmam inspected the ghat roads along with the officials concerned on Monday evening and gave valuable suggestions to the officials to arrange emergency measures for the convenience of devotees.  

In this background, TTD appeals to devotees to take note of restrictions and cooperate with the management.

SE Jagadeeshwar Reddy, VGO Sri Nanda Kishore, DFO Sri Srinivas and others were present

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఉదయం 6 గంటల నుండి రాత్రి 8గంటల వరకే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి.

తిరుమల పత్రికా ప్రకటన డిసెంబర్ 4.: తుఫాను వలన ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా ఉన్నది. దీనివలన వాహన రాకపోకులకు అక్కడక్కడ అంతరాయం కలుగుతోంది. అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు తమ ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురి అవుతున్నారు. తద్వారా వాహనాలు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంతవరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించబడును. కనుక భక్తులు ఈ మార్పును గమనించి టిటిడి కి సహకరించవలసిందిగా కోరడమైనది.

 జె ఈ ఓ శ్రీ వీరబ్రహ్మం ఆధ్వర్యం లో ఘాట్ రోడ్ లలో తనికీలు. వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్ లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వుండేందుకు గాను అధికారులతో కలిసి జె ఈ ఓ శ్రీ వీరబ్రహ్మం ఘాట్ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్, ఫారెస్ట్, సెక్యూరిటీ తదితర విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ఆయన వెంట ఎస్ ఈ జగదీశ్వర రెడ్డి, విజివో నంద కిషోర్, ఫారెస్ట్ అధికారి శ్రీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

టి టి డి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.