RETRACTABLE ROOF SOON IN TIRUMALA TEMPLE-TTD EO_ ‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 3 November 2017: To provide cover to pilgrims during inclement weather conditions, a retractable roof will soon be arranged in Tirumala temple, said TTD EO Sri Anil Kumar Singhal.

The monthly “Dial your EO” program was held at Annamaiah Bhavan in Tirumala on Friday. The EO received the calls from 38 pilgrims across the country.

Answering a pilgrim caller Sri Padmanabha Kumar from Bengaluru, the EO there is an open space between Kalyana Mandapam till Vendi Vakili. To shield the pilgrims from inclement weather conditions, a remote control “Retractable Roof” will be set up by December 15.

KARTHIKA MASA MANAGUDI ON NOVEMBER 13

When a caller Sri Surya Anjaneyulu from Prakasam sought the EO about the conduct of Karthika Masa Managudi, the EO said it will be conducted on November 13.

PUBLICISE IMPORTANT DAYS FOR A PLANNED DARSHAN

Another pilgrim caller from Nellore, Sri Neelima Kumar sought the EO to publicise the peak days in Tirumala so that the pilgrims will avoid rush days and have a planned darshan on normal days. Welcoming the suggestion, the EO said it will be implemented.

SUPRABHATAM BOOKS DURING SEVA

A pilgrim from Tenali Sri Nageswara Rao suggested EO to issue pocket size Suprabhatam books to the pilgrims during the Seva so that they will go through the stanzas while the Seva is on for which the EO agreed to implement soon.

BRING AWARENESS AMONG PILGRIMS WHILE OFFERING CURRENCY NOTES

Sri Raja Gopal from Visakhapatnam who rendered Parakamani Seva suggested EO to bring awareness among pilgrims on not to fold or put vermilion and turmeric inside currency notes while offering in Srivari Hundi. EO thanked the pilgrim for the valuable suggestion and said the suggestion will be implemented.

FOLLOW THE TIME SLOTS TO AVOID WAITING

The EO while answering pilgrim caller Smt Swarnalatha from Chittoor urged the pilgrims to follow the time slots given to them during Rs.300 and footpath darshans. “Please follow the time slots and avoid unnecessary waiting for darshan of Lord Venkateswara”, he added.

ONLINE ACCOMMODATION QUOTA

Answering pilgrim callers, Sri Subba Rao and Sri Leela Kumar from Vijayawada, Sri Krishna from Hyderabad the EO said accommodation online quota will also be released from Friday afternoon onwards.

TAMIL AND HINDI WEBSITES SOON

After successfully launching Telugu version website, we have now launched Kannada, while Tamil and Hindi versions will be launched in coming successive months, said TTD EO Sri AK Singhal.

Before receiving the calls from the pilgrims during the Dial your EO program on Friday, briefing the developmental activities and upcoming events, the EO said, the Annual Brahmotsavams of Goddess Padmavathi Devi at Tiruchanoor will be observed from November 15 to 23 with Dhwajarohanam on first day, Gaja Vahanam on November 19, Swarna Ratham on November 20, Rathotsavam on November 22 and Panchami Teertham on November 23.

AGED AND PARENTS WITH INFANT DARSHAN

TTD will issue 4000 darshan tokens to aged and physically challenged citizens on November 14 and 21 while darshan to parents with infants aged below five years on November 15 and 22 from 9am to 1:30pm.

STATISTICS OF DARSHAN

The EO said, 23.77 lakh pilgrims had darshan in the month of October, 95.46 lakh laddus sold, 55.19 lakh pilgrims had annaprasadam, 31.37 lakh pilgrims had beverages, 11.09 lakhs offered hair as a fulfillment of their oath while the Hundi collections stood at Rs.83.76cr.

e-OFFICE BY MARCH NEXT

The EO said, under the instructions of the Honourable CM of AP Sri N Chandra Babu Naidu, the transformation of entire office of TTD to e-Office will be completed by 2018 March. Initially five departments have adopted this e-filing system while 12 more departments are in the pipe line next. By next March all the 90 departments will opt e-Filing.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

నవంబరు 03, తిరుమల 2017:తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. సూర్యఆంజనేయులు – ప్రకాశం

ప్రశ్న: కార్తీకపౌర్ణమి సందర్భంగా మనగుడిని నిర్వహించండి ?

ఈ.వో. నవంబర్‌ 13న తెలుగు రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.

2. రమేష్‌ – నర్సరావుపేట, రమేష్‌ – నిజామాబాద్‌

ప్రశ్న: టిటిడి కౌంటర్లలో ఆర్జితసేవా టికెట్లు ఇవ్వడం లేదు ?

ఈ.వో. ఎక్కువ మంది భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్లను విడుదల చేస్తున్నాం.

3. సుబ్బారావు – విజయవాడ, లీలాకుమార్‌ – విజయవాడ, కృష్ణ – హైదరాబాద్‌.

ప్రశ్న: ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంబంధించిన గదుల బుకింగ్‌ ఓపెన్‌ కాలేదు?

ఈ.వో. ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయి.

4. శ్రీనివాసరావు – గుంటూరు

ప్రశ్న: శ్రీవారి ఆలయంలో వీలైన రోజుల్లో ముందుగా సమాచారం తెలియజేసి లఘుదర్శనం కల్పించండి. హిందూ ధర్మప్రచార పరిషత్‌ భక్తి సంగీత కార్యక్రమాలకు రుసుము పెంచండి. ఎస్వీబీసిలో ప్రేక్షకులే అన్నమయ్య సంకీర్తనలను పాడి వినిపించేలా కార్యక్రమం రూపొందించండి ?

ఈ.వో. భక్తుల సంఖ్య పెరగడంతో లఘు దర్శనం కల్పించడం సాధ్యంకాదు. ఇతర విషయాలను పరిశీలిస్తాం.

5. నరేష్‌ – పార్వతీపురం

ప్రశ్న: స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కు తిరుమలలో 3 రోజులు పాటు విధులు నిర్వహించేలా అవకాశం కల్పించండి. పరకామణి సేవలో వ్యాపారులను అనుమతించండి ?

ఈ.వో. ప్రస్తుతం శ్రీవారి సేవకులకు 3 రోజులు, 4 రోజుల స్లాట్లను ప్రవేశపెట్టాం. ఈ అనుభవంతో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విషయంలో తగు నిర్ణయం తీసుకుంటాం. పరకామణి సేవలో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రవేట్‌ బ్యాంక్‌ ఉద్యోగులకు అవకాశం కల్పించాం. భవిష్యత్తులో భక్తుల సూచనలను బేరీజు వేసుకుని తగు నిర్ణయం తీసుకుంటాం.

6. వెంకటరమణ – యానాం

ప్రశ్న: దివ్యదర్శనం కాంప్లెక్స్‌నుంచి దర్శనానికి వెళ్లే మార్గంలో చాలా చోట్ల ఇరుకుగా ఉండటం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారు?

ఈ.వో. ఈ మార్గంలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

7. శంకరయ్య – కర్నూలు

ప్రశ్న: కాలినడక మార్గంలో హిజ్రాలను అరికట్టండి ?

ఈ.వో. తగు చర్యలు తీసుకుంటాం

8. మల్లికా – ముక్తేశ్వరం

ప్రశ్న: క్యూలైన్లలో రద్దీ కారణంగా సాంబరు అన్నం వృథా అవుతోంది ?

ఈ.వో. అన్నప్రసాదాలు వృథా కాకుండా శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నాం.

9. ఉమామహేశ్వరం – శ్రీకాకుళం

ప్రశ్న: తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలను అరికట్టండి ?

ఈ.వో. అధిక ధరలు వసూలు చేస్తున్న హోటళ్లు, క్యాంటీన్లపై ఇప్పటికే కఠినచర్యలు తీసుకున్నాం. ఇకపై టిటిడి నిర్ణయించిన ధరలకే ఆహారపదార్థాల విక్రయాలు జరుగుతాయి.

10. నారాయణరావు – హైదరాబాద్‌

ప్రశ్న: ఆర్మీ అధికారులకు, సిబ్బందికి శ్రీవారి ప్రత్యేక దర్సనం కల్పిస్తారా ?

ఈ.వో. ప్రోటోకాల్‌ ప్రకారం అధికారులకు బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నాం. మాజీ సైనికులకు సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పిస్తున్నాం.

11. మధుసుధన్‌ – తిరుపతి

ప్రశ్న: తిరుపతిలో రూ.300 టికెట్లు ఇవ్వండి ?

ఈ.వో. తిరుపతిలోని శ్రీనివాసంలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్సనం టికెట్లను కరెంట్‌ బుకింగ్‌లో కేటాయిస్తున్నాం.

12. రాజలింగం – మహారాష్ట్ర

ప్రశ్న: తిరుమలలో ప్రైవేట్‌ టాక్సీల డ్రైవర్లు దౌర్జన్యానికి దిగుతున్నారు?

ఈ.వో. టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ అధికారులతో కలసి తగు చర్యలు తీసుకుంటాం.

13. కృష్ణమూర్తి – చిత్తూరు, నీలిమాకుమార్‌ – నెల్లూరు.

ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగుల లైన్లలో బెంచీలు ఏర్పాటు చేయండి ?

ఈ.వో. వృద్ధులు, దివ్యాంగులకు టోకెన్ల మంజూరు కోసం 7 కౌంటర్లు, 750 మంది కూర్చునేందుకు వీలుగా షెడ్‌ ఏర్పాటు చేశాం.

14. నాగరాజు – శ్రీకాకుళం

ప్రశ్న: అన్నమాచార్య సంకీర్తనలను వినేందుకు ప్రత్యేకంగా యాప్‌ రూపొందించండి ?

ఈ.వో. పరిశీలిస్తాం.

15. రాజగోపాల్‌ – విశాఖ

ప్రశ్న: పరకామణి సేవకు వస్తుంటాం హుండీలో నోట్లకు కుంకుమ పూయడం, మడిచి హుండీలో వేయడం వల్ల నలిగిపోతున్నాయి. దీనిపై భక్తులకు అవగాహన కల్పించండి?

ఈ.వో. దీనిపై భక్తులకు అవగాహన కల్పిస్తాం.

16. రామారావు – విశాఖ

ప్రశ్న: రూ.50 దర్శనం టికెట్లను పునరుద్ధరించండి ?

ఈ.వో. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం భక్తులకు టైం స్లాట్‌ విధానం ద్వారా నిర్ణీత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. త్వరలో సర్వదర్శనం భక్తులకు కూడా టైం స్లాట్‌ విధానాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం.

17. దుర్గా – హైదరాబాద్‌

ప్రశ్న: ఆర్జితసేవలను ఇద్దరికి మాత్రమే ఇస్తున్నారు. పిల్లలతో కలిపి కుటుంబంలో నల్గురికి ఇచ్చేలా ఏర్పాటు చేయండి?

ఈ.వో. ఎక్కువ మంది భక్తులకు ఆర్జితసేవల్లో అవకాశం కల్పించేందుకు వీలుగా ఇద్దరికి మాత్రమే కేటాయిస్తున్నాం.

18. చైతన్య – విజయవాడ

ప్రశ్న: సప్తగిరి మాసపత్రికకు చందా కట్టాను. రావడం లేదు ?

ఈ.వో. మీకు ఫోన్‌ చేసి పత్రిక అందేలా చూస్తాం

19. లక్ష్మీనారాయణ – ఖమ్మం

ప్రశ్న: అలిపిరి కాలినడక మార్గంలో మెట్లు సరిగా లేక భక్తులు జారీ పడుతున్నారు. విష్ణునివాసంలో గది తీసుకున్నాక ప్రైవేట్‌ వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు ?

ఈ.వో. అలిపిరి మార్గంలో మెట్లను సరిచేస్తాం. విష్ణునివాసంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకుంటాం.

20. పద్మనాభకుమార్‌ – బెంగుళూరు

ప్రశ్న: శ్రీవారి ఆలయంలో కల్యాణమండపం వద్ద భక్తులు వర్షానికి ఇబ్బంది పడుతున్నారు ?

ఈ.వో. వర్షానికి ఇబ్బంది లేకుండా డిసెంబర్‌ 15 లోపు ఏర్పాట్లు చేస్తాం.

21. ఫణి – హైదరాబాద్‌

ప్రశ్న: శ్రీవారిమెట్టు మార్గంలో 700 మెట్టు నుంచి పై వరకు మరుగుదొడ్లు లేవు, తాగునీరు సరిగాలేదు ?

ఈ.వో. త్వరలోనే మరుగుదొడ్లు నిర్మిస్తాం, పరిశుభ్రమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.

22. సంతోష్‌ – అదిలాబాద్‌

ప్రశ్న: మా గ్రామంలో ఉన్న పురాతన శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేయండి?

ఈ.వో. టిటిడి నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం

23. శ్రీనివాస్‌ – విజయవాడ

ప్రశ్న: తిరుమల ఆలయం నుంచి హథీరాం బావాజీ మఠానికి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయండి?

ఈ.వో. పరిశీలిస్తాం.

24. శివనాగేశ్వరరావు – తెనాలి

ప్రశ్న: సుప్రభాత సేవ సమయంలో భక్తులకు ఆయా భాషలలో సుప్రభాతం కరపత్రాలను అందించండి?

ఈ.వో. సూచన బావుంది. తప్పకుండా అందిస్తాం.

25. స్వర్ణలత – చిత్తూరు

ప్రశ్న: దివ్యదర్శనం కాంప్లెక్స్‌లో స్లాట్‌ సమయం కంటే ముందు వెళితే అనుమతించలేదు ?

ఈ.వో. కేటాయించిన స్లాట్‌ ప్రకారం భక్తులు వస్తే ఎక్కువ సేపు వేచియుండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.

26. వెంకటరత్నం – తాడేపల్లిగూడెం, ఆంజనేయులు ముంబై

ప్రశ్న: టిటిడి అందిస్తున్న సౌకర్యాలు చాలా బాగున్నాయి?

ఈ.వో. ధన్యవాదాలు.

27. నాగప్రసాద్‌ – ప్రొద్దుటూరు

ప్రశ్న: శ్రీనివాస కల్యాణానికి అర్జీ పెట్టాం. పరిశీలించండి.

ఈ.వో. రూట్‌ మ్యాప్‌ ప్రకారం శ్రీనివాసకల్యాణాలు నిర్వహిస్తున్నాం. మీ అర్జీని పరిశీలిస్తాం.

28. సుబ్రమణ్యం – బెంగుళూరు

ప్రశ్న: క్యూలైన్లలో, మహాద్వారం వద్ద తోపులాటను అరికట్టండి ?

ఈ.వో. కంపార్ట్‌మెంట్ల నుంచి భక్తులు వెలుపలికి వచ్చేటప్పుడు తోపులాట జరుగకుండా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశాం. మహాద్వారం నుంచి వెండివాకిలి వరకు ఒకే క్యూలైన్‌ను ఏర్పాటు చేశాం. వెండి వాకిలి వద్ద ఇన్‌ అండ్‌ ఔట్‌ విధానంలో మార్పులు తీసుకువచ్చాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌. ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, డిప్యూటీ ఈవోలు శ్రీ వేణుగోపాల్‌, శ్రీమతి గౌతమి, శ్రీ రాజేంద్రుడు, శ్రీ వెంకటయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.