TTD TO HAVE WORLD CLASS SECURITY SET UP BY NEXT FEB-TTD EO_ డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 3 November 2017: The hill temple of Lord Venkateswara will have a world class security set up by 2018 February, said TTD EO Sri Anil Kumar Singhal.

After the monthly Dial your EO programme, during the press conference at Annamaiah Bhavan, the EO said, the CVSO Sri A Ravikrishna has recently visited New Delhi, Hyderabad to review the Airport Model of Security system. “We will have a sophisticated security mechanism after four months”, the EO asserted.

REFUND FOR CURRENT BOOKING ACCOMMODATION

Later he said, TTD is refunding 25% and 50% tariff for advance booking of accommodation through online if the pilgrims vacate the rooms within the prescribed time. “Similarly we have contemplated for current booking also. The amount will be refunded directly to pilgrims’s Aadhaar linked bank account.

ONLINE TRANSACTION FEE TO COME DOWN

TTD has been negotiating with banks to cut down the fees on line transactions and they are hopefully come down by December.

THREE DAY / FOUR DAY SRIVARI SEVA

There is a huge response for three day and four day Srivari Seva and all the booking for Vaikuntha Ekadasi and New Year have already completed. This will provide an opportunity to youth, educated and employed sections also. Similarly we are contemplating the same for scouts also following the feedback from pilgrims ( A pilgrim caller Sri Naesh from Parvathipuram of Vizianagaram sought EO for three day and four day slot for Scouts and Guides too).

VAIKUNTHA EKADASI ARRANGEMENTS TO BE OVER BY DEC 15

All the civil a works and other arrangements for Vaikuntha Ekadasi will be completed by December 15. Already JEO Tirumala Sri KS Sreenivasa Raju has been continuously monitoring the progress of works.

TIRUCHANOOR BRAHMOTSAVAMS FROM NOV 15

Following Tiruchanoor Brahmotsavams which commences from November 15 onwards elaborate arrangements are underway in the supervision of Tirupati JEO Sri P Bhaskar.

All Projects Special Officer Sri N Muktheswara Rao, CE Sri Chandrasekhar Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

నవంబరు 03, తిరుమల 2017: తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఈవో మాటల్లోనే…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మూెత్సవాలు నవంబరు 15 నుంచి 23వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. నవంబరు 15న – ధ్వజారోహణం, నవంబరు 19న – గజ వాహనం, నవంబరు 20న – స్వర్ణరథం, గరుడవాహనం, నవంబరు 22న – రథోత్సవం, నవంబరు 23న – పంచమితీర్థం జరుగనున్నాయి.

– అమ్మవారి బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, అన్నప్రసాదాలు, తాగునీరు తదితర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టాం.

– బ్రహ్మూెత్సవాల వాహనసేవల్లో, తిరుచానూరులోని ఆస్థానమండపం, మహతి ఆడిటోరియం, శిల్పారామంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం.

వ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ప్రత్యేక దర్శనం : నవంబరు 14, 21వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు వెయ్యి మందికి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మందికి, మధ్యాహ్నం 3 గంటలకు మరో వెయ్యి మందికి కలుపుకుని 4 వేల మందికి దర్శన టోకెన్లు జారీ చేస్తాం.

– నవంబరు 15, 22వ తేదీల్లో 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తాం. ఈ సౌకర్యాలను భక్తులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నాం.

వృద్ధులు, దివ్యాంగులకు టోకన్‌ జారీ కౌంటర్లు : వృద్ధులు, దివ్యాంగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో భాగంగా కొత్తగా 7 టోకెన్‌ మంజూరు కౌంటర్లు, వేచి ఉండే షెడ్‌ ఏర్పాటుచేశాం. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశముంది.

సర్వదర్శనం భక్తులకు నూతన కాంప్లెక్స్‌ : సర్వదర్శనం భక్తుల కోసం నూతన కాంప్లెక్స్‌ను ప్రారంభించాం. భక్తుల కోరిక మేరకు ఇక్కడ 16 లడ్డూ టోకెన్‌ జారీ కౌంటర్లను ఏర్పాటుచేశాం.

నందకంలో నూతన మినీ కల్యాణకట్ట : భక్తుల సౌకర్యార్థం నందకం విశ్రాంతి గృహంలో మినీ కల్యాణకట్టను అందుబాటులోకి తీసుకొచ్చాం. తద్వారా ఆ పరిసరాల్లోని భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అవకాశం కల్పించాం.

తిరుమల హోెటళ్లలో నిర్ణీత ధరల అమలుకు చర్యలు : తిరుమలలోని హోటళ్ల యజమానులు ఆహార పదార్థాలు, పానీయాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. టిటిడి నిర్ణయించిన ధరలను అమలుచేసేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. హోటళ్లలో ధరలను విజిలెన్స్‌ అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

భక్తుల ఫిర్యాదుతో క్షురకులపై చర్యలు : కల్యాణకట్టలో భక్తుల నుంచి డబ్బులు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కొంతమంది మంది క్షురకులపై చర్యలు తీసుకున్నాం. ఇకపై భక్తుల నుంచి అలాంటి ఫిర్యాదులు రాకుండా కల్యాణకట్టలలో మరింత పర్యవేక్షణ చేపట్టాం. బహుశా ఇపుడు అలాంటి ఫిర్యాదులు లేవని ఆశిస్తున్నాం.

టిటిడి డైరీలు, క్యాలెండర్లు : 2018వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని టిటిడి సమాచార కేంద్రాల్లో భక్తులకు అందుబాటులో ఉంచడమైనది.

టిటిడి వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌ : ttdsevaonline.com వెబ్‌సైట్‌ కన్నడ వర్షన్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ నెలలో తమిళ వర్షన్‌ను, వచ్చే నెలలో హిందీ వర్షన్‌ను ప్రారంభిస్తాం.

అదేవిధంగా, ఈవో మాట్లాడుతూ అక్టోబరులో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 23.77 లక్షలు, లడ్డూ ప్రసాదం 95.46 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 55.19 లక్షలు, అల్పాహారం, టి, కాఫి, పాలు 31.37 లక్షలు, తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11.09 లక్షలు, హుండీ ఆదాయం 83.76 కోట్లు, గదుల ఆక్యుపెన్సీ శాతం 105 శాతంగా నమోదైందని తెలిపారు. గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2018, మార్చి చివరి నాటికి టిటిడిలో పూర్తిస్థాయిలో ఈ-ఫైలింగ్‌ విధానాన్ని అమలుచేస్తామన్నారు. ప్రస్తుతం 5 విభాగాల్లో ఈ-ఫైలింగ్‌ అమలవుతోందని, ఈ నెలలో మరో 12 విభాగాలకు విస్తరిస్తామని తెలిపారు. తిరుమలలో మరో 4 నెలల్లో పూర్థిస్థాయిలో అధునాతన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్‌లోని భద్రతాధికారులతో సివిఎస్‌వో చర్చలు జరిపారని చెప్పారు. ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

వైకుంఠ ఏకాదశికి క్యూలైన్లు, షెడ్ల ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు పరిశీలించామని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేస్తామన్నారు. యువతను, ఉద్యోగులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు వీలుగా 3 రోజులు, 4 రోజులు స్లాట్లను ప్రారంభించామని, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్లాట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ అయిపోయాయని వివరించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు నిర్ణీత వ్యవధిలోపు గదులు రద్దు చేసుకుంటే రీఫండ్‌ అందిస్తున్నామని, ఇదేతరహాలో కరంట్‌ బుకింగ్‌ భక్తులకు కూడా త్వరలో రీఫండ్‌ అందిస్తామని తెలిపారు. రీఫండ్‌ మొత్తాన్ని భక్తుల ఆధార్‌ లింకుతో ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. భక్తుల ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన ఫీజు తగ్గించేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నామని, డిసెంబరులో నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.