Review Meeting on The 5th phase Kalyanamasthu _ ఐదవ విడత కల్యాణమస్తుకు పకడ్బందీగా ప్రణాళికలు : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు
Tirupati, Aug 12, 2009: The 5th phase Kalyanamasthu programme on October 28, 2009 should be conducted with the cooperation of the District Administration told Sri I.Y.R.Krishna Rao, Executive Officer, TTDs. On Wednesday morning he has reviewed the arrangements for the smooth conduct of the mass marriages.
While speaking, he said that the District Collector would be the Chairman for the conduct of Kalyanamasthu and he directed the Secretary Dharma Prachara Parishad to identify the senior officers of TTD as Secretaries at District Level. There will be three liaison Officers for three regions in the state who will manage, motivate and monitor the campaign and actual conduct of the mass marriages in the District who assist the OSD Kalyanamasthu. He directed Sri A.V.Dharma Reddy, Spl Officer, TTDs, Sri P.V.S.Ramakrishna, Chief Vigilance and Security Officer and Dr. N.Yuvaraj, Joint Executive Officer to liaison in Rayalaseema, Prakasam, Nellore, coastal and Telangana Districts respectively. Extensive publicity through electronic and print media with the assistance of District Public Relations Officers he added. Awareness programmes will be arranged at all the District Head Quarters duly involving people representatives, Officers etc,. A tele/Video conference may be organised by the Hon’ble Chief Minister/ Endowment Minister to motivate the Public and to involve and enthuse the administrative machinery.
Sri Ramachandra Reddy, Supdt Engineer, Sri Sesha Reddy, G.M, and other senior officers were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఐదవ విడత కల్యాణమస్తుకు పకడ్బందీగా ప్రణాళికలు : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు
తిరుపతి, ఆగష్టు -12, 2009: తితిదే ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఐదవ విడత కల్యాణమస్తు కార్యక్రమం విజయవంతం చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు చెప్పారు. బుధవారం ఉదయం తితిదే పరిపాలనా భవనంలో ఆయన కల్యాణమస్తు నిర్వహణపై అధికారులతో సమీక్షించారు.
ఈసందర్భంగా ఇఓ మాట్లాడుతూ కల్యాణమస్తు ప్రచార సామాగ్రి, లగ్నపత్రిక విడుదల, మాంగల్యపూజకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. కల్యాణమస్తు విజయవంతానికి జిల్లా అధికార యంత్రాంగాలు కృషిచేసేలా చూడాలని, అలాగే వారు ఏమేమి చేయాలనే విషయమై మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీకి జిల్లా కలెక్టర్లకు టిటిడి అధికారులు సహకరిస్తారని ఇఓ తెలిపారు. కిందటేడాదిలాగానే రాష్ట్ర వ్యాప్తంగా కల్యాణమస్తు నిర్వహిస్తామని, అయితే నియోజకవర్గ స్థాయిలో జరిగే కల్యాణమస్తు కార్యక్రమాలలో టిటిడి జోక్యం చేసుకోదని, కేవలం జిల్లాల స్థాయిలో ఆయా కలెక్టర్లకు, ఆయా జిల్లాస్థాయి కమిటీలకు సహకరిస్తుందని చెప్పారు. ఇక రాష్ట్రంలోని తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాలకు టిటిడి నుంచి లైౖజనింగ్ ఆఫీసర్లను నియమిస్తునట్లు ఇఓ వెల్లడించారు. ఈమేరకు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి, కోస్తా జిల్లాలకు సివిఎస్‌ఓ రామకృష్ణ, తెలంగాణకు తిరుపతి జెఇఓ యువరాజ్ లైజన్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని ఇఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి, జెఇఓ శ్రీ డా.యువరాజ్, ముఖ్య భద్రతాధికారి శ్రీ పి.వి.ఎస్. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.