REVIEW ON PROGRESS OF KARNATAKA STATE CHARITIES WORKS HELD _ కర్ణాటక సత్రాల అభివృద్ధి పనుల పురోగతిపై ఈవో సమీక్ష

TIRUMALA, 26 JULY 2023: TTD EO Sri AV Dharma Reddy along with the Honourable Minister of Transport and Muzrai (Endowments) of Karnataka State, Sri Ramalinga Reddy held a review meeting over the progress of development works of Karnataka State Charities in Tirumala on Wednesday.

The review meeting was held at Annamaiah Bhavan. On behalf of TTD, the Chief Engineer Sri Nageswara Rao narrated the status of works, the expected date of completion of the building likely by December this year through a Powerpoint Presentation. The representatives of Karnataka State Charities also presented a detailed plan of the number of rooms in Block A, B, Kalyana Mandapam etc. along with their designs.

TTD EO asked the officials from Karnataka state to provide the necessary designs on time to complete the work as per schedule. The Karnataka Minister also directed his team of Endowment officials to give the required data to TTD without any delay.

The Karnataka State has handed over the site to TTD on 27th December in 2021 towards the development of Karnataka State Charities which is estimated at a cost of Rs.220cr. The building has two blocks with a total of 242 rooms, 12 dormitories, a Marriage Hall, a Suite block and an old block with 86 rooms.

Among the participants, Sri Rajendra Kataria, Secretary Endowments, the Commissioner of Endowments Dr Basavarj and other teams of officials from Karnataka State, DE Electrical Sri Ravishankar Reddy, DyEE Sri Sudhakar and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కర్ణాటక సత్రాల అభివృద్ధి పనుల పురోగతిపై ఈవో సమీక్ష

తిరుమల, 2023, జూలై 26: తిరుమలలోని కర్ణాటక సత్రాల అభివృద్ధి పనుల పురోగతిపై టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, కర్ణాటక రాష్ట్ర రవాణా, దేవాదాయ శాఖల మంత్రి శ్రీ రామలింగారెడ్డితో కలిసి బుధవారం అన్నమయ్య భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ముందుగా టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తవుతాయని వివరించారు. కర్ణాటక స్టేట్ ఛారిటీస్ ప్రతినిధులు తమ డిజైన్లతో పాటు బ్లాక్ ఎ, బి భవనాలు, కల్యాణ మండపంలో గల గదుల వివరాలతో కూడిన ప్రణాళికను తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేసేందుకు అవసరమైన డిజైన్లను సకాలంలో అందించాలని కర్ణాటక రాష్ట్ర అధికారులను టీటీడీ ఈవో కోరారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా టీటీడీకి అవసరమైన సమాచారం అందించాలని కర్ణాటక మంత్రి తమ ఎండోమెంట్ అధికారుల బృందాన్ని ఆదేశించారు.

కర్ణాటక ప్రభుత్వం 2021 డిసెంబర్ 27న రూ.220 కోట్ల వ్యయంతో కర్ణాటక సత్రాల అభివృద్ధి కోసం తిరుమలలో గల స్థలాన్ని టీటీడీకి అప్పగించింది. ఈ భవనంలో మొత్తం 242 గదులతో రెండు బ్లాకులు, 12 డార్మిటరీలు, ఒక కల్యాణమండపం, ఒక సూట్ బ్లాక్, 86 గదులతో కూడిన పాత బ్లాక్ ఉన్నాయి.

ఈ సమీక్షలో కర్ణాటక దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ రాజేంద్ర కటారియా, కమిషనర్ డాక్టర్ బసవరాజ్ తో కూడిన అధికారుల బృందం, టీటీడీ డిఇ ఎలక్ట్రికల్ శ్రీ రవిశంకర్ రెడ్డి, డెప్యూటీ ఇఈ శ్రీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.