REVIEW ON SECURITY ARRANGEMENTS FOR SRIVARI BRAHMOTSAVAMS- 2022 HELD _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

Tirumala, 30 August 2022:TTD vigilance and district police officials conducted a review on security arrangements for the ensuing Srivari annual Brahmotsavams at the command control centre in the PAC-4 on Tuesday.

 

As part of the exercise they reviewed all security arrangements for Dwajarohanam fete on September 27 and also the band bust arrangements during the visit of the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy.

 

The officials also discussed on the insist parking issues, queue lines, vigilance against thefts, patrolling on ghat roads, night patrols, procurement of essential security equipment, barricades, removal of wastes from the rest houses etc.

 

Additional SP Sri Muniramaiah, VGO Sri Bali Reddy, EE Sri Jaganmohan Reddy, Traffic DSP Sri Venugopal, CIs Sri Jaganmohan Reddy, Sri Chandrasekhar, AVSOs Sri Surendra, Sri Sai Giridhar, Sri Manohar, Sri Shivaiah and other officials were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

తిరుమల, 2022 ఆగస్టు 30: శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లో గ‌ల క‌మాండ్ కంట్రోల్ రూమ్ స‌మావేశ మందిరంలో ఈ స‌మీక్ష జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజైన సెప్టెంబ‌రు 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న కోసం బందోబ‌స్తు, వాహ‌న‌సేవ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగ‌త‌నాలు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు, క్యూలైన్ల‌లో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్ల‌లో కూంబింగ్‌, రాత్రి గ‌స్తీ విధులు, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు తెప్పించుకోవ‌డం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద పోగ‌యిన వ్య‌ర్థాల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

అద‌న‌పు ఎస్పీ శ్రీ మునిరామ‌య్య, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇఇ శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ శ్రీ వేణుగోపాల్‌, సిఐలు శ్రీ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వోలు శ్రీ సురేంద్ర‌, శ్రీ సాయిగిరిధ‌ర్‌, శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ శివ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.