VARAHA JAYANTHI OBSERVED _ తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

TIRUMALA, 30 AUGUST 2022: On the auspicious occasion of Sri Varaha Jayanthi, special Abhishekam was observed in Sri Bhu Varaha Swamy temple at Tirumala on Tuesday.

As part of it, Abhishekam with milk, curd, honey, coconut water and sandal paste was rendered to the main deity in Garbhalaya amidst chanting of Vedic Mantras by Veda Parayanamdars.

Temple DyEO Sri Ramesh Babu and others were present. One of the chief priests of the Tirumala temple Sri Venugopala Deekshitulu performed the Abhishekam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, 2022 ఆగస్టు 30: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు ఈ అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.