REVIEWED SECURITY ARRANGEMENTS FOR BTUs WITH CVSO AND SP-SO_ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు : టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 24 Aug. 19: As the annual brahmotsavams in Tirumala are fast approaching, the Special Officer Sri AV Dharma Reddy along with Chief Vigilance and Security Officer of TTD Sri Gopinath Jatti and Tirupati Urban SP Sri Anburajan reviewed the security arrangements.

The high-level review meeting took place at Annamaiah Bhavan in Tirumala on Saturday. Speaking to media after the review meeting, the Special Officer said, every minute details were studied keeping in view the past experiences, on how to provide the security to a multitude of visiting pilgrims during the annual religious festival.

The SO also said, providing hassle-free darshan and vahana seva is the ultimate goal and our vigilance in coordination with the police will come out with a concrete plan on the security settings for the ensuing brahmotsavams, he added.

Later CVSO said, all the parking, traffic, necessary signage boards, ghat road restrictions etc.to be made for the upcoming annual brahmotsavams have been discussed with the Tirupati Urban Police wing. In view of Garuda Varadhi works at Tirupati, we have also discussed on some traffic restrictions in the temple city. Like in every year, this year also the movement of two-wheelers will be banned from midnight of October 3 till the morning of October 5 in view of Garuda Seva on October 4″, he added.

Tirupati SP told the media that a preliminary meeting was held on Brahmotsavam security. “The deployment pattern is the same with just a few changes keeping in view the last year experience. However we will come out with more details of our security set up in next two weeks time”, he maintained.

Additional CVSO Sri Sivakumar Reddy, ASP Sri Uma Shankara Raju, VGOs Sri Manohar, Sri Ashok Kumar Goud and other AVSOs and police officers were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు : టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

ఏర్పాట్ల‌పై స‌మీక్షించిన టిటిడి సివిఎస్వో, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ

తిరుమల, 2019 ఆగ‌స్టు 24: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ‌ కెకెఎన్‌.అన్బురాజ‌న్‌ క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌త‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సమావేశం ప్రారంభంలో ప్ర‌త్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం, అర్బ‌న్ పోలీసులు క‌లిసి బ్ర‌హ్మోత్స‌వాల్లో రోజువారీ భ‌ద్ర‌తా ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించేందుకు స‌మావేశ‌మ‌య్యార‌ని తెలిపారు. సెప్టెంబ‌రు 30న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని, ఈ ప‌ర్య‌ట‌న భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పైనా చ‌ర్చిస్తార‌ని వివ‌రించారు.

విశేష‌మైన‌ రోజుల్లో ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు : సివిఎస్వో

బ్ర‌హ్మోత్స‌వాల్లో ధ్వ‌జారోహ‌ణం రోజున గౌ..ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌, గ‌రుడ సేవ‌, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం లాంటి విశేష‌మైన రోజుల్లో గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపారు. దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా సిసిటివిల నిఘాతో పాటు ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగిస్తామ‌న్నారు. అక్టోబ‌రు 4న గ‌రుడ‌సేవ సంద‌ర్భంగా అక్టోబ‌రు 3న అర్ధ‌రాత్రి నుండి అక్టోబ‌రు 5వ తేదీ ఉద‌యం వ‌ర‌కు రెండు ఘాట్ రోడ్ల‌లో ట్రాఫిక్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని వెల్ల‌డించారు. తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు, ల‌డ్డూప్ర‌సాదం ద‌ళారుల‌ను అరిక‌ట్టేందుకు స్థానిక పోలీసుల స‌హ‌కారంతో ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. భ‌ద్ర‌త ఏర్పాట్ల‌కు సంబంధించి మీడియా స‌ల‌హాల‌ను కూడా ఆహ్వానించారు.

అద‌నంగా పార్కింగ్ ప్ర‌దేశాలు : తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ

బ్ర‌హ్మోత్స‌వాల‌కు వాహ‌నాల్లో వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ప్ర‌దేశాల‌కు సూచిక‌బోర్డుల ఏర్పాటుతోపాటు అద‌నంగా పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేస్తామ‌ని తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ‌ కెకెఎన్‌.అన్బురాజ‌న్ తెలిపారు. భ‌క్తుల‌కు భ‌ద్ర‌తాప‌రంగా ఇబ్బందులు లేకుండా ముఖ్య‌మైన ప్రాంతాల్లో ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేస్తామ‌న్నారు. తిరుమ‌ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 65 మంది ద‌ళారుల‌ను అరెస్టు చేశామ‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో ఏఎస్పి శ్రీ ఉమాశంక‌ర్‌రాజు, టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, విఎస్వోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ అశోక్‌కుమార్ గౌడ్ ఇత‌ర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.