RHYTHMIC CONCERTS IN KAPILATHIRTHAM _ కపిలతీర్థంలో లయబద్ధంగా సాగిన నవ డోలు వాద్య సమ్మేళనం

Tirupati, 09 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College of Music and Dance and Sri Venkateswara Nadaswaram and Dolu School on the ninth day of the annual Brahmotsavam of Sri Kapileswara Swamy were magical.

As part of this, the Nava Dolu Vadya Sammelan performed by Dr. YL Srinivasulu and Nagaraju group on the stage set up in the temple premises enthralled the art lovers.

Earlier, Sri Venkateswara Bhagavatar, Harikatha faculty of the college, and his group of disciples sang devotional music.

After that, the Bharatanatyam performance by Sri. Ravis Subramaniam, the faculty of the college and his group of students was impressive.

In this program, the principal of the college Dr. Uma Mudubala, other faculty, students and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో లయబద్ధంగా సాగిన నవ డోలు వాద్య సమ్మేళనం

తిరుప‌తి, 2024, మార్చి 09: శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై డా.వైఎల్.శ్రీనివాసులు, నాగరాజు బృందం ప్రదర్శించిన నవ డోలు వాద్య సమ్మేళనం లయబద్ధంగా సాగింది.

అంతకుముందు కళాశాల హరికథ అధ్యాపకులు శ్రీ వేంకటేశ్వర భాగవతార్, వారి శిష్య బృందం వినసొంపుగా భక్తి సంగీతాన్ని ఆలపించారు.

ఆ తరువాత కళాశాల అధ్యాపకులు శ్రీ రవిసుబ్రమణ్యం, వారి శిష్యబృందం భరతనాట్య ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, ఇత‌ర అధ్యాప‌కులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.