SIVA PARVATI KALYANAM HELD _ వైభవంగా శివపార్వతుల కల్యాణం

TRISULA SNANAM ON MARCH 10

On the ninth day of Sri Kapileswara Swamy annual Brahmotsavam in Tirupati, the celestial Kalyanam of Siva and Parvati was held in grandeur.

On this occasion, under the guidance of the temple’s head priest Sri Manivasan Gurukul, the priests performed the ritualistic kalyanam of Parvati Parameshwar with utmost devotion.

Later on Tiruchi, Swami paraded through the streets and blessed the devotees.

TRISHUL SNANAM ON MARCH 10:

The last day of Brahmotsavam will be celebrated on Sunday, March 10, with Trisula Snanam. 

From 6.30 am to 8.30 am Sri Natarajaswamy will give darshan on Suryaprabha Vahanam.  From 9 am to 10.30 am Trisula Snanam ghattam will be conducted as per the tenets of Saivagama. 

Dhwajavarohanam will be held between 6 pm and 7.30 pm.  The annual fest will conclude with Ravanasura Vahanaseva held from 8 to 10 pm.

Tirupati Mayor Dr. Sirisha, Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri. Subbaraju, and other staff, devotees participated in this celestial Kalyanam.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శివపార్వతుల కల్యాణం
 
•⁠  ⁠మార్చి 10న త్రిశూలస్నానం
 
 తిరుప‌తి, 2024, మార్చి 09: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది.
 
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై  స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
 
మార్చి 10న త్రిశూలస్నానం : 
 
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 10వ తేదీ ఆదివారం త్రిశూలస్నానం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.
 
ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.