RISHI PANCHAMI VRATAM HELD AT SV VEDIC UNIVERSITY _ ఎస్వీ వేద వ‌ర్సిటీలో శాస్త్రోక్తంగా ఋషి పంచమి వ్ర‌తం

Tirupati, 11 September 2021: As part of the TTD spiritual endeavour for humanity during Bhadrapada month, Rishi Panchami Vratam was conducted at the Yagashala of SV Vedic University on Saturday.

The Varsity Dean Acharya Goli Venkata Subramania Sharma highlighted the significance of the Rishi Panchami Vratam.

After Sankalpam, the archakas performed Ganapati Puja, Prarthana and Rishi Panchami Vratam as per Agama traditions. The event concluded with Nivedana, Neeranjanam, Kshama Prarthana and Mangala harati.

The faculty of Sri Venkateswara Vedic University and students were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ వేద వ‌ర్సిటీలో శాస్త్రోక్తంగా ఋషి పంచమి వ్ర‌తం

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 11: లోక కల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న భాద్రపద మాస పూజా కార్య‌క్ర‌మాల్లో భాగంగా శనివారం తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యంలో ఋషి పంచమి వ్ర‌తం శాస్త్రోక్తంగా జ‌రిగింది. వ‌ర్సిటీలోని యాగ‌శాల‌లో ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఈ సందర్భంగా వ‌ర్సిటీ డీన్ ఆచార్య గోలి వెంక‌ట‌సుబ్ర‌హ్మ‌ణ్య‌శ‌ర్మ ఋషిపంచమి వ్ర‌తం విశిష్టతను తెలియజేశారు. సప్త ఋషులు ఎంతో జ్ఞాన స్వరూపులని, నక్షత్ర మండలంలో వీరికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సప్త ఋషుల ఆరాధన వల్ల గత జన్మలో చేసిన కాయిక, వాచక, మానసిక పాపాలు తొలగిపోతాయని, వ్యాధిబాధలు, ఈతిబాధలు నశిస్తాయని తెలిపారు. నూతన దంపతులకు ముందుగా అరుంధతి సమేత సప్త ఋషుల దర్శనం చేయిస్తారని, తద్వారా వారికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని వివరించారు.

ముందుగా సంక‌ల్పంతో ప్రారంభించి గ‌ణ‌ప‌తిపూజ‌, ప్రార్థ‌న‌, ఋషిపంచమి వ్ర‌తం నిర్వ‌హించారు. ఇందులో అరుంధతితోపాటు సప్త ఋషులైన కస్యప, అత్రి, భరధ్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్టులకు పుష్పార్చన చేశారు. ప‌లు నివేద‌న‌లు, నీరాజ‌నాలు అందించిన అనంత‌రం  క్ష‌మాప్రార్థ‌న, మంగళ హారతితో ఈ వ్రతం ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.  

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.