RISHIKESH BRAHMOTSAVAMS_ మే 27 నుండి జూన్‌ 4వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 10 May 2018: The annual Brahmotsavams of Sri Venkateswara Swamy temple located at Andhrashramam in Rishikesh is scheduled from May 27 to June 4.

The important days includes Dhwajarohanam on May 27 in Karkataka lagnam between 9.30am and 10.30am, Rathotsavam in Mesha Lagnam on June 3 ay 4am and Kalyanotsavam on the same day evening between 4pm and 6pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

మే 27 నుండి జూన్‌ 4వ తేదీ వరకు రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 10, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 27 నుండి జూన్‌ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. మే 22న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 26న సాయంత్రం అంకురార్పణం నిర్వహిస్తారు.

మే 27న ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. జూన్‌ 3న ఉదయం 4 గంటలకు మేష లగ్నంలో రథోత్సవం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. జూన్‌ 4వ తేదీన ఉదయం 10 నుండి 11 గంటల మధ్య కర్కాటక లగ్నంలో చక్రస్నానం జరుగనుంది.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.