SPECIAL ABHISHEKAM PERFORMED TO BEDI ANJANEYA_ తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి

Tirumala, 9 May 2018: Special Abhishekam to Sri Bedi Anjaneya Swamy was performed with religious fervour on Thursday at Tirumala on the occasion of Hanuman Jayanthi.

Tirumala JEO Sri KS Sreenivasa Raju who took part in this fete, speaking to media persons later said, Panchamritha Abhishekam was performed to Sri Bedi Anjaneya Swamy. Special pujas will also be performed to Konerugattu Anjaneya Swamy, Japali Hanuman and 60-ft tall Prasanna Anjaneya Swamy at the seventh mile on the first ghat road.

TTD has made elaborate arrangements including free transportation bus facility for the sake of the locals and pilgrims to carry them from Tirumala to Seventh Mile and back to Tirumala on this festival day from 11am till 6pm.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFIER, TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి

మే 10, తిరుమల, 2018: తిరుమలలో గురువారం హనుమజ్జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 9 గంటలకు ప్రత్యేకపూజలు, అభిషేకం చేపట్టారు. టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఈ అభిషేకంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా తిరుమలలోని జాపాలి తీర్థంలోని ఆంజనేయస్వామివారిని కూడా భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుంటారని చెప్పారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కాలినడకన వచ్చే భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారని, ప్రసాదాలు పంపిణీ చేస్తామని తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.