RISHIKESH BTU FROM JUNE 2 TO 6 _ జూన్ 2 నుండి 6వ తేదీ వరకు రిషికేష్ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
జూన్ 2 నుండి 6వ తేదీ వరకు రిషికేష్ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 జూన్ 30: రిషికేష్ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 2 నుండి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. జూన్ 1వ తేదీ సాయంత్రం అంకురార్పణం, మూషిక వాహనసేవ నిర్వహిస్తారు.
తేదీ
02-06-2024
ఉదయం – ధ్వజారోహణం, కల్పవృక్షవాహనం
సాయంత్రం – హంస వాహనం
03-06-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
04-06-2024
ఉదయం – శేషవాహనం
సాయంత్రం – గజవాహనం
05-06-2024
ఉదయం – సింహవాహనం
సాయంత్రం – కల్యాణోత్సవం, వృషభవాహనం
06-06-2024
ఉదయం – త్రిశూలస్నానం, తిరుచ్చి ఉత్సవం
సాయంత్రం – ధ్వజావరోహణం, రావణాసుర వాహనం
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.