RUDRA YAGAM REACHES FIFTH DAY_ శ్రీ కపిలేశ్వరాలయంలో ఐదవ రోజు ఘనంగా రుద్రయాగం

Tirupati, 10 November, 17: The Rudra Yagam reached fifth day on Friday in the famous Lord Shiva temple at Kapilateertham.

Rudra Trishati, Rudra Japam, Laghu Purnahuti were performed.

The pilgrim devotees took part in this fete O payment of Rs.500 on which two devotees were allowed for a single day.

Temple DyEO Sri Subramanyam and others supervised the arrangements.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ఐదవ రోజు ఘనంగా రుద్రయాగం

తిరుపతి, 2017 నవంబరు 10: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) శుక్రవారం ఘనంగా జరిగింది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రుద్రజపం, హోమం, నివేదన, లఘు పూర్ణాహుతి, దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, విశేషదీపారాధన నిర్వహించనున్నారు. రుద్రయాగం వెయ్యి రుద్రాభిషేకాల ఫలాన్ని ఇస్తుందని, ఇందులో పాల్గొన్న వారికి మృత్యుగండం, బాలారిష్టాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీస్వామినాథస్వామి, శ్రీవిజయ స్వామి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.