LAKSHAKUM KUMARCHANA IN SRI PAT ON NOV 14_ నవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

TIrupati, 10 November 17: The celestial Laksha Kumkumarchana will be performed in the holy shrine of Tiruchanoor on November 14.

After the morning rituals, the vermilion is offered to the processional deity of Goddess Padmavathi Devi in Sri Krishna Mukha Mandapam, chanting the divine names of Goddess for one Lakh times between between 8am to 12noon.

The grihastas willing to take part in this fete will have to pay Rs.1,116 on which two persons will be allowed.

ANKURARPANAM

Later on the same day evening there will be ankuraropanotsavsm in connection with annual Brahmotsavams. Tiruchi, senadhipathi utsavam, punyahavachanam will be performed between 6:30pm to 8:30pm in the temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి, 2017 నవంబరు 10: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 14వ తేదీ మంగళవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

అదేరోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఐదు లడ్డూలు, ఐదు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.