RUDRABHISHEKAM COMMENCES _ ధ్యానారామంలో నెల రోజుల పాటు రుద్రాభిషేకాలు
TIRUPATI, 26 OCTOBER 2022: With the advent of the auspicious month of Karthika Masa, the month-long ritual of Rudrabhishekam commenced in Dhyanaramam at SV Vedic University of TTD on Wednesday.
Abhishekam was performed to the mammoth Shiva Lingam located in the premises with eleven ingredients for 11 times reciting Rudra Namakam-Chamakam and other sacred mantras.
Everyday, Panchamrita Rudrabhishekam will be performed during the entire month between 6am and 7am which will be telecasted live on SVBC for the sake of global devotees.
CEO SVBC Sri Shanmukh Kumar, SV Vedic Varsity Registrar Sri Radhesyam and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ధ్యానారామంలో నెల రోజుల పాటు రుద్రాభిషేకాలు
తిరుపతి, 2022 అక్టోబరు 26: కార్తీకమాసం సందర్భంగా బుధవారం ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలో రుద్రాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి, బృహదీశ్వర స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుండి 7 గంటల వరకు జరిగే రుద్రాభిషేకాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించారు. లఘున్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, ఎస్వీ వేద వర్సిటీ రిజిష్ట్రార్ శ్రీ రాధేశ్యామ్, డీన్ శ్రీ డా.ఫణియజ్ఞేశ్వర యాజులు, అధ్యాపకులు శ్రీ నీలకంఠ శర్మ, శ్రీ కార్తికేయన్, విశ్వవిద్యాలయం ఆచార్యులు, వేదపండితులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.