SABHAPARVAM SET TO CONCLUDE ON JULY 23 _ జూలై 23న ముగియనున్న సభాపర్వం

TIRUMALA, 22 JULY 2023: The spiritual discourse of Sabha Parva Parayanam (Sabha Parvam-Dharma Saram) from epic Mahabharata is all set to conclude at Nada Neeranjanam platform in Tirumala on Sunday.

Sabha Parva comprising of 81 chapters, 10 sub-Parvas, 3700 shlokas speaks about the glory of Sri Krishna highlighting the message of Dharma to the society.

The Sabha Parva Parayanam was commenced by TTD on June 1 last year where in renowned scholars from Dharmagiri Veda Vignana Peetham, Tirumala, Sri Venkatachalapati explained the meaning of each shloka while the shlokas were recited by Sri Raghavendra in a befitting manner for this spiritual event which lasted for over a year winning the hearts of millions of devotees.

The SVBC telecasted the program every day between 8pm and 9pm for the sake of global devotees.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 23న ముగియనున్న సభాపర్వం

తిరుమల, 2023, జూలై 22: తిరుమల నాద నీరాంజనం వేదికపై జరుగుతున్న మహాభారతంలోని సభాపర్వ పారాయణం (సభాపర్వం-ధర్మసారం) ఆదివారం ముగియనుంది. 81 అధ్యాయాలు, 10 ఉప పర్వాలు, 3700 శ్లోకాలతో కూడిన సభాపర్వం శ్రీకృష్ణుని మహిమలను, సమాజానికి ధార్మిక సందేశాన్ని అందిస్తుంది.

2022, జూన్ 1న సభాపర్వ పారాయణం ప్రారంభమైంది. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ వేంకటాచలపతి ప్రతి శ్లోకానికీ అర్థాన్ని వివరించగా, శ్రీ రాఘవేంద్ర శ్లోక పారాయణం చేశారు. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.