OCTOBER MONTH ONLINE DARSHAN _ జూలై 24న అంగప్రదక్షిణ టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 22 JULY 2023: TTD is set to release  Angapradakshinam tokens for the month of October on July 24 at 10am.

Darshan and Accommodation quota for the month of October to the SRIVANI Trust Donors will be available for booking from 11am on Monday.

Senior Citizens and Physically Challenged quota for the month of October will be available for booking on July 24 at 3 PM.

Special Entry Darshan Additional Quota for the months of August & September and October quota will be opened on July 25 at 10am.

The accommodation quota in Tirumala, Tirupati and Talakona for the month of October, will be available for booking on July 26 at 10am.

The devotees are requested to make note of this and book their darshan and accommodation in TTD official website. https://tirupatibalaji.ap.gov.in

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 24న అంగప్రదక్షిణ టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2023, జూలై 22: తిరుమ‌ల శ్రీ‌వారి అంగప్రదక్షిణ టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 24న ఉదయం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి ట్రస్టు దాతల కోసం…

శ్రీవాణి ట్రస్టు దాతలకు దర్శనం, గదులకు సంబంధించి అక్టోబరు కోటాను జూలై 24న ఉదయం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటా విడుదల

ఆగస్టు, సెప్టెంబరు నెల‌లకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అక్టోబరు కోటా విడుదల

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 25న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

గదుల కోటా...

తిరుమల, తిరుపతి, తలకోనలో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 26న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి  https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో  సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.