INDIANS FOLLOW THE DHARMIC PATH IN THEIR DAILY LIFE_ భారతీయుల ఆచారాలన్నీ ధర్మబద్ధమైనవే : శ్రీ నారాయణస్వామి టిటిడి కళాశాలల్లో సదాచారం తరగతులు

Tirupati, 12 March 2018: The Dharmic principles are a part of life style of every Indian which will have a scientific tempo behind it, said renowned scholar Sri Narayana Swamy.

Sadacharam classes were organised in SV Oriental College in Tirupati on Monday. Sri Narayana Swamy briefed the students on the importance of spirituality, the pious way of living, good habits and moral values taught by our ancestors etc. in an elaborated way.

Meanwhile the Sadacharam classes are being conducted undert he aegis of HDPP wing of TTD for the sake of students.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భారతీయుల ఆచారాలన్నీ ధర్మబద్ధమైనవే : శ్రీ నారాయణస్వామి టిటిడి కళాశాలల్లో సదాచారం తరగతులు

మార్చి 12, తిరుపతి, 2018: భారతీయులు ఆచరించే ఆచారాలన్నీ ధర్మబద్ధంగా ఉంటాయని, వీటి వెనుక శాస్త్రీయత కూడా ఉంటుందని ప్రముఖ పండితుడు శ్రీ నారాయణస్వామి పేర్కొన్నారు. టిటిడి ఆధ్వర్యంలోని కళాశాలల్లో సోమవారం సదాచారం శిక్షణ తరగతులు జరిగాయి. కళాశాలల్లో జనవరి నుండి సదాచారం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఎస్వీ ఓరియంటల్‌ కళాశాలలో జరిగిన తరగతుల్లో శ్రీ నారాయణస్వామి ఉపన్యసిస్తూ ఆచారాలు మానవుల శారీరక, మానసిక ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడతాయన్నారు. ఆచారాలు, సంప్రదాయాలు ఎన్నో శుభఫలాలను కలిగిస్తాయని తెలిపారు. అదేవిధంగా, తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో శ్రీ శ్రీమన్నారాయణ, ఎస్‌.జి.ఎస్‌.ఆర్ట్స్‌ కళాశాలలో శ్రీభీమన్న, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాలలో శ్రీమతి జి.శ్రీదేవి, ఎస్వీ శిల్ప కళాశాలలో శ్రీమతి కృష్ణవేణి, ఎస్వీ సంగీత కళాశాలలో శ్రీ లక్ష్మీనారాయణ, ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌ కళాశాలలో శ్రీ మునికృష్ణారెడ్డి సదాచారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ”ఉగాది, శ్రీరామనవమి, శుభప్రద దీపిక, ధర్మపరిచయం” పుస్తకాలను పంపిణీ చేశారు.

హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో టిటిడి ఆధ్వర్యంలోని కాలేజీలలో జనవరి నెల నుండి సదాచారం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.