SADHU SUBRAHMANYA SHASTRI HERALDED SRIVARI GLORY EMBEDDED IN INSCRIPTIONS- SPEశాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : AKERS _ శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామారావు

RICH TRIBUTES PAID ON HIS 132nd JAYANTHI

Tirupati,17 December 2021: Sri Sadhu Subramaniam Shastry brought to light the glory of Srivaru and Tirumala temple which were embedded in the inscriptions, said scholars.
 
Rich tributes were paid on the occasion of 132nd Jayanti of Sri Shastry on Friday.
 
TTD officials accompanied by Sri Shastry’s daughter Smt Girija Devi, grandson, Justice CM Murthy, TTD Projects Officer Sri Vijayasaradhi, HDPP secretary Sri Rama Rao and others paid floral tributes and garlanded the bronze statue of Sri Sadhu Subramaniam Shastry in front of SVETA at Tirupati.

Speaking at the Jayanti Sabha held in the SVETA building Smt Sadhu Girija Devi said the celebration of her father’s Jayanti program every year was a rich tribute to his contributions to TTD.

SVETA Director Smt Prashanti said Sri Shastry when serving as the first Peishkar of Srivari temple had also discharged duties as an epigraphist and translated the collection of copper plate inscriptions found in the temple.

Later the HDPP secretary Sri Rama Rao and research assistant Acharya Nagolu Krishna Reddy, retired Principal Sri Krishna Reddy, SVHigher Vedic Studies Institute Project officer Dr Akella Vibhishana Sharma spoke and lauded the contributions of Sri Shastry.

Thereafter the TTD officials felicitated the kin of Sri Shastry and others.

Earlier a documentary on the life and contributions of Sri Sadhu Subramaniam Shastry was also exhibited.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

 

శాసనాల ద్వారా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటిన శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్యశాస్త్రి : హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామారావు

132వ జయంతి సంద‌ర్భంగా నివాళులు

తిరుపతి, 2021 డిసెంబరు 17: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని శాసనాలను అనువదించి ఆల‌య చ‌రిత్ర‌ను, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మ‌హ‌నీయుడు శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అని హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామారావు అన్నారు. శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి 132వ జయంతి సంద‌ర్భంగా శుక్రవారం తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నం ఎదురుగా గ‌ల ఆయ‌న కాంస్య విగ్ర‌హానికి శ్రీ సాధు సుబ్ర‌హ్మ‌ణ్య‌శాస్త్రి కుమార్తె శ్రీ‌మ‌తి గిరిజాదేవి, మ‌న‌వ‌డు, జ‌డ్జి శ్రీ సిఎం.మూర్తి, టిటిడి ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారధి, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ రామారావు త‌దిత‌ర అధికారులు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

అనంతరం శ్వేత‌లోని స‌‌మావేశ మందిరంలో జరిగిన జయంతి సభలో శ్రీ రామారావు ఉప‌న్య‌సిస్తూ శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి శ్రీవారి ఆలయ పేష్కార్‌గా ఉంటూ ఎపిగ్రఫిస్టుగా రాగిరేకుల శాసనాలను సేకరించి అనువదించినట్టు చెప్పారు. ఆయ‌న సేవ‌ల‌ను ప్ర‌తి ఏడాదీ స్మ‌రించుకుంటున్నామ‌ని వివ‌రించారు. శ్రీ‌మ‌తి సాధు గిరిజాదేవి మాట్లాడుతూ త‌న తండ్రి టిటిడికి చేసిన సేవ‌ల‌కు గుర్తుగా ప్ర‌తి ఏటా ఆయ‌న జ‌యంతి, వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

ఆ త‌రువాత‌ శ్వేత సంచాల‌కులు శ్రీమతి ప్రశాంతి, పరిశోధకులు ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణారెడ్డి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ ప్రసంగిస్తూ శాసన పరిశోధకుడిగా శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి అందించిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా శ్రీ సాధు సుబ్రహ్మ‌ణ్యశాస్త్రి కుమార్తె శ్రీమతి గిరిజాదేవి, మనవడు, జడ్జి శ్రీ సిఎన్.మూర్తిని, ఇతర అతిథులను సన్మానించి శ్రీవారి ప్రసాదాలను అందించారు. అనంత‌రం శ్రీ సాధు సుబ్ర‌మ‌ణ్య‌శాస్త్రిపై రూపొందించిన డాక్యుమెంట‌రీని ప్ర‌ద‌ర్శించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.