SADHU SUBRAMANYA SASTRI DEATH ANNIVERSARY OBSERVED _ శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి ఘనంగా నివాళి

TIRUPATI, 10 SEPTEMBER 2022:  The 41st Death Anniversary of the first Peishkar of Tirumala temple, versatile scholar Sri Sadhu Subrahmanya Sastri was observed in Tirupati on Saturday.

 

The Grandson of Sri Sastri and the Kadapa Judge Sri Murti speaking on the occasion recalled the impeccable services rendered by his grandfather as Peishkar of Tirumala, how he brought to light the inscriptions about the grandeur of Tirumala temple to the world.

 

The daughter of Sri Sastri Smt Girija, colleague of Sri Sastry, Sri Krishna Reddy, SVETA Director Smt Prasanthi, Producer of SVBC Sri Ramana and others were also present.

 

Earlier they garlanded and paid floral tributes to the life-size statue of Sri Sastri located in front of the SVETA building.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి ఘనంగా నివాళి

తిరుపతి, 2022 సెప్టెంబ‌రు 10: టిటిడిలో పేష్కారుగా, ఎపిగ్రాఫిస్టుగా విశేష సేవలందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 41వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల వారి విగ్రహానికి శనివారం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. శ్వేత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

శ్రీ శాస్త్రిగారి మనవడు, కడప జడ్జి శ్రీ మూర్తి మాట్లాడుతూ తిరుమలకు సంబంధించి అనేక చారిత్రిక, సాంస్కృతిక, ఇతిహాసిక శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ శాస్త్రి గారికి దక్కుతుందన్నారు. వారి జీవనం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. శాస్త్రిగారి కుమార్తె శ్రీమతి సాధు గిరిజ మాట్లాడుతూ శాస్త్రిగారు శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై భక్తితో అనేక శాసనాలను పరిశీలించి, పరిశోధించి అందరికీ అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. శాస్త్రిగారి సహోద్యోగి శ్రీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ఎ. ప్రశాంతి, ఎస్వీబీసీ ప్రొడ్యూసర్ శ్రీ బి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.