ASTOTTARAM PERFORMED_ శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
Tirupati, 4 November 2017: Astottara Sata Kalasabhishekam was performed in the temple of Sri Kodanda Rama Swamy in Tirupati on Saturday.
This ritual was observed between 6am and 8am with 108 kalasas to processional deities.
Later there will be unjal seva to the deities in Sri Ramachandra Pushkarini.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2017, నవంబరు 04: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం అష్టోత్తర శతకలశా భిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 6.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి మునిలక్ష్మి,టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది