SAHASRA KALASABHISHEKAM AND HANUMANTHA SEVA OBSERVED_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
Tirupati, 24 June 2017: The Sahasra Kalashabhisekham was performed in a grand and colorful manner at the Sri Kodanda Rama temple at Tirupati on Saturdaymorning.
The Sahasra Kalasabhishekham was conducted between 6am to 8amwith 1000 silver vessels containing sacred waters. The Hanumantha vahana seva will be performed later in the evening. The colorfully flower decked deity along with consort Sita and Lakshmana will be taken out on Hanumantha vahana along the four mada streets in the temple town.
Dy EO Smt Munilakshmi, Temple superintendent Sri Uma Maheswar Reddy, temple priests and others participated in the event.
KALYANOTSAVAM IN KRT ON JUNE 25
The monthly Kalyanotsavam in Sri Kodanda Rama Temple in Tirupati will be observed on June 25 in the auspicious Punarvasu nakshatram, the birth star of Lord Rama.
The Kalyanam will be performed in the morning from 11AM amidst chanting of vedic hymns by the temple priests and the participant couple have to pay Rs.500 to take part in the fete and they will presented with uttariyam, blouse piece, anna prasadam after seva.
Later in the evening the utsava idols of Sri Rama, Sita and Lakshman will be taken on a procession in the mada streets of the temple at 5.30PM and further accorded Unjal seva near Sriramachandra Pushkarini.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
తిరుపతి, 2017 జూన్ 24: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 4.30 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.
ఆలయంలో ఉదయం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లకు సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు ప్రముఖులు పాల్గొన్నారు.
జూన్ 25న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ 25వ తేదీ ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.