ANNAMA PIONEERED PALLAVI-CHARANAM IN SANKEERTANS-SRI BRAHMANANDA SASTRY_ పల్లవి, చరణాలకు ఆద్యుడు అన్నమయ్య : శ్రీ ఎం.బ్రహ్మానందశాస్త్రి

Tirupati, 16 March 2018: Renowned scholar Sri Brahmananda Sastry said, Saint Poet Tallapaka Annamacharya has pioneered “Pallavi and Charanam” and created a new style in his sankeertans.

Speaking on the occasion of 515th Death Anniversary of the saint poet at Annamacharya Kalamandiram on Friday, the scholar said, Annamaiah became “Padakavita Pitamaha” through his sankeertans on Lord Venkateswara.

Later Dr K Madhujyothi delivered speech on “Annamaiah Sankeertanalu-Stree Chaitanyam” and elaborated on the importance given by Annamaiah to women in his sankeertans. Sri B Shankar Rao presented speech on “Annamaiah Sankeertana Vedam” and described on the Dasya Bhakti, Saranagati Prapatti of Annamacharya in his sankeertans.

In the evening, Smt Annapurna and her team rendered the sankeertans of Annamacharya at Mahati Auditorium.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పల్లవి, చరణాలకు ఆద్యుడు అన్నమయ్య : శ్రీ ఎం.బ్రహ్మానందశాస్త్రి

మార్చి 16, తిరుపతి, 2018: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య పల్లవి, చరణం రెండింటినీ జోడించి కీర్తనలు రచించడంలో ఆద్యుడని గుంటూరుకు చెందిన ప్రముఖ పండితుడు శ్రీ ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి ఉద్ఘాటించారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి ”అన్నమయ్య సాహిత్య వైభవం” అనే అంశంపై ఉపన్యసించారు. భక్తజనానికి వీనులవిందుగా శ్రీ వేంకటేశ్వరుని నామంతో కీర్తనలు రచించి అన్నమయ్య ప్రాచుర్యంలోకి వచ్చారని తెలిపారు. స్వామివారి రూపాన్ని కళ్లకు కట్టేలా అన్నమయ్య సాహిత్యం ఉంటుందన్నారు.

అనంతరం తిరుపతికి చెందిన శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ తెలుగు ఆచార్యులు డా|| కొలకలూరి మధుజ్యోతి ”అన్నమయ్య సంకీర్తనలు-స్త్రీ చైతన్యం” అనే అంశంపై ఉపన్యసిస్తూ స్త్రీ ప్రాధాన్యాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో ఆవిష్కరించారని తెలిపారు. ఆ తరువాత హైదరాబాద్‌కు చెందిన శ్రీ జి.బి.శంకరరావు ”అన్నమయ్య సంకీర్తన వేదం” అనే అంశంపై ప్రసంగిస్తూ అన్నమయ్య సాహితీ క్షేత్రంలో దాస్యభక్తి, శరణాగతి తదితర అన్ని రకాల భక్తిమార్గాలను అందించారని వివరించారు.

సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్‌.అన్నపూర్ణ బృందం గాత్ర సంగీత సభ జరుగనుంది. ఆ తరువాత రాత్రి 7 గంటలకు తిరుపతికి చెందిన కుమారి చాతుర్య బృందం నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.

మహతి కళాక్షేత్రంలో…

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఢిల్లీ సోదరీమణులు శ్రీమతి ఎస్‌.శైలజ, ఎస్‌.సౌందర్య బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనుంజయుడు, రీసెర్చి అసిస్టెంట్‌ డా|| సి.లత ఇతర అధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.