KRT BTU OFF TO A RELIGIOUS START WITH DHWAJAROHANAM_ రూ.38 లక్షలతో శ్రీ కోదండరామాలయంలో అభివృద్ధి పనులు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 16 March 2018: The annual brahmotsavams in Sri Kodanda Rama Swamy temple in Tirupati off to a ceremonious start qith Dhwajarohanam on Friday.

The event took place in the auspicious Mesha Lagnam between 8:30am and 9am when the Garuda dhwaja patam was hoisted on temple pillar mast marking the commencement of Navahnika brahmotsavams.

Speaking on the occasion, TTD EO Sri Anil Kumar Singhal told media persons that elaborate arrangements of security and engineering were made for the big fete. ” About Rs.38lakhs worth renovation works were carried out by the engineering wing. Every day there will be vahana sevas between 8am and 10am again 8pm and 10pm during brahmotsavams. The important days includes Garuda Seva on March 20, Hanumantha Vahanam on March 21, Rathotsavam on March 23 and Chakrasnanam.on March 24 with which the annual fest concludes”, he added.

CV and SO Sri A Ravikrishna, DyEO Smt Jhansi, Suptd Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy and other temple staffs, large number of devotees were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

రూ.38 లక్షలతో శ్రీ కోదండరామాలయంలో అభివృద్ధి పనులు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ధ్వజారోహణంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మార్చి 16, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో వసతులు పెంచేందుకు రూ.38 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయని, తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆలయంలో ఉదయం 8.30 నుండి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు ఆధారాలున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా మార్చి 20న గరుడసేవ, మార్చి 21న హనుమంత వాహనం, మార్చి 23న రథోత్సవం, మార్చి 24న చక్రస్నానం జరుగనున్నాయన్నారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయని తెలిపారు. సివిఎస్‌వో ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు.

ఆలయ ప్రధాన కంకణభట్టార్‌ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు ప్రసంగిస్తూ ధ్వజారోహణంతో సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు తెలిపారు. రాముడు ధర్మస్వరూపుడని, ఆయన ఆదర్శాలను భక్తులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ధ్వజారోహణంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తే సమస్తదోషాలు తొలగుతాయని, సంతానం లేనివారికి ఉత్తమ సంతానం కలుగుతుందని తెలిపారు.

ముందుగా ఉదయం 6 నుండి 8 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులు, ధ్వజపటం, చక్రత్తాళ్వారులకు తిరువీధుల ఉత్సవం నిర్వహించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం జరిగింది. రాత్రి 8 నుండి 10 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేయనున్నారు.

ఆకట్టుకున్న అలంకరణలు :

ఆలయంలో అద్భుతంగా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టారు. తితిదే గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో రామాయణంలోని ఘట్టాలతో ఏర్పాటుచేసిన సెట్టింగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సుందరకాండలో లక్ష్మణ, సుగ్రీవుల సమక్షంలో శ్రీరామచంద్రునికి సీతాదేవి చూడామణిని సమర్పిస్తున్న హనుమంతుడు, అరణ్యకాండలో కబంధుడనే ఒంటికన్ను రాక్షసుడితో యుద్ధం చేస్తున్న శ్రీరామలక్ష్మణులు సెట్టింగులు ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీశేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.