SAKSHATKARA VAIBAVOTSAVAM POSTERS RELEASED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవం పోస్టర్లు ఆవిష్కర‌ణ

Srinivasa Mangapuram, 01 July 19: TTD EO Sri Anil Kumar Singhal on Monday released the wall posters of Sakshatkara vaibavotsavam in Srinivasa Mangapuram at his chambers in TTD Administrative building in Tirupati.

This annual fete will be observed from July 6 to 8 in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram.

Paruveta Utsavam will be observed on July 9.

Dyeo K .Dhananjayulu, Aeo D .Lakshmaiah,Temple Inspector B .Anil kumar,Temple priest Balaji swami were also present


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవం పోస్టర్లు ఆవిష్కర‌ణ

జూలై 01, తిరుపతి, 2019; శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవం పోస్టర్లను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ సోమ‌వారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జూలై 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా సాక్షాత్కార వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జూలై 6, 7, 8వ తేదీలలో ఉదయం 9.00 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.

కాగా, శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారు జూలై 6న‌ పెద్ద‌శేష వాహ‌నంపై, జూలై 7న హనుమంత వాహనంపై, జూలై 8న శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శ‌న‌మిస్తారు.

జూలై 9న పార్వేట ఉత్సవం :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 9న పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆస్థానం చేప‌డ‌తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ కె.ధ‌నంజ‌యుడు, ఏఈవో శ్రీ డి.ల‌క్ష్మ‌య్య‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ బి.అనిల్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.