FREQUENT INSPECTIONS BY OFFICERS MUST IN REST HOUSES-EO _ వ‌స‌తి స‌ముదాయాల్లో సౌక‌ర్యాలపై సీనియ‌ర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

Tirupati,July 1,2019 : TTD Executive Officer Sri Anil Kumar Singhal has directed senior officials to regularly inspect the devotees facilities delivery systems in TTD rest houses to ensure improved amenities.

Speaking after a review meeting at the TTD administrative building on Monday the EO said that all senior officials should frequently inspect the TTD Rest houses and submit a report on development works needed.

He asked them to promote a landscape garden and greenery and fencing around Sri Padmavathi Rest house at Tirumala. He wanted the ongoing works of queue lines and others at the Narayanagiri gardens to be completed on war footing. Similarly he wanted noise free fans to be installed at many locations inside Srivari temple.

He also directed officials to assess the water storage in the reservoirs of Tirumala to meet thr requirements of devotees and to increase the capacity of drain water treatment plant at Balaji Nagar so that treated water could be utilised for gardening etc.

Among others he also directed officials to remove unwanted sign boards in Tirumala, ensure that the counting of coins in Srivari Hundi is done on a daily basis and deposited in banks, to remove temporary sheds of TTD engineering departments and more toilets to be built on Alipiri walkers path .

TTD JEO Of Tirumala Sri KS Sreenivasa Raju ,CVSO Sri Gopinath Jatty,Tirupati Incharge JEO and FA and CAO Sri O Balaji and others participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

వ‌స‌తి స‌ముదాయాల్లో సౌక‌ర్యాలపై సీనియ‌ర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ : టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

జూలై 01, తిరుపతి, 2019 ; శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేస్తున్న యాత్రికుల కోసం తిరుమ‌లలోని వ‌స‌తి స‌ముదాయాల్లో క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలను సీనియ‌ర్ అధికారులు త‌ర‌చూ ప‌ర్య‌వేక్షించాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సీనియ‌ర్ అధికారులు క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స‌తి గ‌దుల‌ను ప‌రిశీలించి చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై నివేదిక రూపొందించాల‌ని సూచించారు. తిరుమ‌ల‌లోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక‌ట్టుకునేలా ఉద్యాన‌వ‌నం పెంచాల‌న్నారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో నిర్మిస్తున్న క్యూలైన్లు, స్వామి పుష్క‌రిణి అభివృద్ధి ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు. శ్రీ‌వారి ఆల‌యంలో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో శ‌బ్ద‌ర‌హిత ఫ్యాన్లు ఏర్పాటు చేయాల‌న్నారు. తిరుమ‌ల‌లోని జ‌లాశ‌యాల్లో ఉన్న నీటి నిల్వ‌లు భ‌క్తుల అవ‌స‌రాల‌కు ఎన్ని రోజుల వ‌రకు స‌రిపోతాయ‌నే విష‌యాన్ని ప‌రిశీలించాల‌న్నారు. బాలాజి న‌గ‌ర్‌లో ఉన్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ సామ‌ర్థ్యాన్ని పెంచాల‌ని, మొక్క‌ల పెంప‌కం కోసం ఈ నీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. తిరుమ‌ల‌లో వినియోగంలో లేని వివిధ బోర్డుల‌ను తొల‌గించాల‌న్నారు. ప‌ర‌కామ‌ణి విభాగంలో నిల్వ ఉన్న నాణేల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు లెక్కించి బ్యాంకుల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. తిరుప‌తి, తిరుమ‌ల‌లో ఇంజినీరింగ్ ప‌నుల కోసం తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్ల‌ను ఆ త‌రువాత తొల‌గించాల‌ని సూచించారు. అలిపిరి వ‌ద్ద కాలిన‌డ‌క భ‌క్తుల సౌక‌ర్యార్థం అద‌నంగా మ‌రుగుదొడ్లు నిర్మించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, తిరుప‌తి ఇన్‌చార్జి జెఈవో మ‌రియు ఎఫ్ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.