SAKSHATKARA VAIBHAVAM COMMENCES IN SKVST _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవం ప్రారంభం
Tirupati, 13 July 2021: The annual Sakshatkara Vaibhavam fete commenced in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Tuesday.
The Snapana Tirumanjanam to Utsava Deities was performed between 9am and 10:30am in Ekantam due to Covid restrictions.
In the evening there will be Pedda Sesha Vahanam followed by Asthanam at 6pm.
Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjeyudu, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayalu, Temple Inspector Sri Yogananda Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవం ప్రారంభం
తిరుపతి, 2021 జులై 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వామివారిని పెద్దశేష వాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా రెండో రోజు బుధవారం హనుమంత వాహనంపై, మూడో రోజు గురువారం గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం, వాహన సేవలు, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, శ్రీ చెంగల్రాయలు, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ యోగానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.